twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళనాడులో మరోసారి ఎన్టీఆర్ ట్రైల్స్

    By Srikanya
    |

    జూ.ఎన్టీఆర్ మరో సారి తమిళనాడు లో తన శక్తిని పరీక్షించుకోవటానకి సిద్దపడుతున్నాడు. శక్తి సినిమాని తమిళంలో అదే రోజున విడుదల చేసారు కానీ అది వర్కవుట్ కాలేదు. అయితే తెలుగులోనూ ప్లాప్ కావటంతో అది పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని ఇప్పుడు ఊసరవిల్లితో మరోసారి అక్కడ మార్కెట్ లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. అందులోనూ తమన్నాకి అక్కడ మంచి మార్కెట్ ఉండటంతో అక్కడ బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఊసరవిల్లి సినిమాపై ఎన్టీఆర్ చాలా నమ్మకంగా ఉన్నారు. మొన్న ఆడియో పంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ... ఈసారి మాత్రం బంతి స్టేడియం దాటుతుంది. సూరి అంత బాగా తీసాడు. ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని చూసుకుంటున్నప్పుడు తను ఎంత బాగా తెరకెక్కించాడో అర్దమైంది. నేను నా భాధ్యతగా కొత్త తరహా సినిమా చేసా. ఆదరించే భాధ్యత అభిమానులదే.

    అలాగే గతంలో నేను నటించిన సినిమాల్లో ఒక చిన్న మార్పు కూడా చెప్పకుండా ఓకే చేసిన కథలు ఆది, సింహాద్రి, ఇప్పుడు ఊసరవిల్లి మూడోది అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు ఎన్టీఆర్. కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.

    English summary
    After his last attempt at making it big in Tamil films failed with Shakti turning out to be a major disaster at the box office, the actor is once again trying out to get a foot hold in the market with his upcoming release Oosaravelli.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X