twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భోజనం, టాయిలెట్లు కావాలని అడిగితే.. బూతులు తిట్టిన క్రేజీ డైరెక్టర్.. కేసు నమోదు చేసిన నటి!

    |

    మూడు బ్లాక్ బస్టర్ విజయాలతో దక్షిణాదిలో అట్లీ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. అతడు తెరకేకించిన రాజా రాణి, తేరి, మెర్సల్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం అట్లీ, విజయ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా నయనతార నటిస్తోంది. తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సందేశాత్మక అంశాన్ని జోడించడం అట్లీ ప్రత్యేకత. ఈ టాలెంటెడ్ యువదర్శకుడు తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు.

    కుక్క కంటే హీనంగా

    కుక్క కంటే హీనంగా

    యువ దర్శకుడు అట్లీపై ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అట్లీ తమని షూటింగ్ లో కుక్కలా కంటే హీనంగా చూస్తున్నాడని, అవమానానికి గురిచేస్తున్నాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అట్లీపై ఇంత వరకు ఎలాంటి వివాదాలు లేవు. తాజాగా సదరు మహిళ అట్లీపై ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

    భోజనం, టాయిలెట్లు అడిగిన పాపానికి

    భోజనం, టాయిలెట్లు అడిగిన పాపానికి

    విజయ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 13న అట్లీ తమని షూటింగ్ లో బూతులు తిడుతూ, అసభ్యకరమైన కామెంట్లతో రెచ్చిపోయాడని సదరు మహిళ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కేవలం భోజనం, మంచి టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అడిగిన పాపానికి తమని ఇలా నిత్యం అవమానపరుస్తున్నాడు అని ఆమె పేర్కొంది. అట్లీతో పాటు అతడి అసిస్టెంట్ దర్శకులు కూడా తమని కనీసం మనుషుల్లాగా కూడా చూడడం లేదని ఆమె వాపోయింది.

    ఎన్నికల హడావిడి

    ఎన్నికల హడావిడి

    అట్లీపై ఏప్రిల్ 13నే ఫిర్యాదు చేయాలని అనుకున్నాం. కానీ పోలీసులు అంతా ఎన్నికల హడావిడిలో ఉండడంతో ఆగిపోయాం. కొన్నిసార్లు తమని షూటింగ్ నుంచి కూడా బలవంతంగా గెంటేశారని ఆమె పేర్కొంది. అట్లీపై తగిన చర్యలు తీసుకుని జూనియర్ ఆర్టిస్టులకు ఇలాంటి అవమానాలు ఎదురుకాకుండా చూడాలిని ఆమె కోరింది.

    మరో అస్త్రం

    మరో అస్త్రం

    ఇక సినిమా విషయానికి వస్తే మెర్సల్ చిత్రంలో వైద్యరంగంలో అవినీతి, లోపాలపై అస్త్రం సంధించిన అట్లీ.. ప్రస్తుతం తెరక్కిస్తున్న విజయ్ చిత్రంలో క్రీడారంగంలో లొసుగులపై బాణం ఎక్కుపెట్టాడు. ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఈ చితం తెరకెక్కుతోంది. విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. క్రీడారంగంలో పేరుకుపోయిన అవినీతి, రాజకీయాలని అట్లీ ఈ చిత్రం ద్వారా సమాజానికి తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Junior artist accuses director Atlee of verbal abuse on the sets of Thalapathy 63
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X