స్నానం చేస్తుండగా వీడియో.. నాలుగేళ్లుగా అత్యాచారం.. సింగర్ చిన్మయి ఫైర్

తమిళ నాట రోజుకో కొత్త కేసు నమోదు అవుతోంది. న్యాయం చేయాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు తండ్రీకొడుకులు జయరాజ్, ఫినిక్స్ ఘటన, నిన్న ఏడేళ్ల బాలిక జయప్రియ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. నేడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆమెపై నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. తాజాగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఘటన అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. ఈ ఘటనపై సింగర్ చిన్మయి శ్రీపాద ఫైర్ అయింది.

తమిళ నాట ఆగ్రహం..

తమిళ నాట ఆగ్రహం..

వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జయరాజ్, ఫినిక్స్ సంఘటన దేశం మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. లాక్ డౌన్‌లో తమ షాపును ఎక్కువసేపు తెరిచి ఉంచారని పోలీసులు అతి కిరాతకంగా ప్రవర్తించారు. చివరకు వారి చావుకు కారణమయ్యారు. ఈ ఘటనపై కేవలం తమిళ ప్రజలు మాత్రమే కాదు యావత్ భారతావని దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

జయప్రియ ఘటన..

జయప్రియ ఘటన..

ఏడేళ్ల బాలికను ముగ్గురు కిరాతకులు అత్యాచారం చేసి చంపిన ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన తమిళ సమాజంతో పాటు సెలెబ్రిటీలు సైతం ఫైర్ అయ్యారు. చట్టాలు మార్చాలి, మహిళలకు రక్షణ కల్పించాలని అందరూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా విన్నవించుకుంది.

తాజాగా ఈ ఘటన..

తాజాగా ఈ ఘటన..

చెయ్యూరు యూత్ లీడర్ దేవేంద్రన్ అతని సోదరుడు కలిసి ఓ మహిళపై గత నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. శశికళ (22) స్నానం చేస్తుండగా వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేయసాగారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆమెను తుదముట్టించారని తెలుస్తోంది.

ఫైర్ అయిన చిన్మయి..

ఫైర్ అయిన చిన్మయి..

ఈ మేరకు చిన్మయి స్పందిస్తూ.. JusticeForSasikala అంటే ఏంటో వివరించింది. ‘22 ఏళ్ల యువతి స్నానం చేస్తుండగా.. ఇద్దరు సోదరులు వీడియో తీశారు. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ గత నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. జూన్ 24న ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాడుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నార'ని తెలిపింది. అంతేకాకుండా వారు ఓ పొలిటికల్ పార్టీకి చెందిన వారని తెలుస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput Pet Dog Fudge Heart Breaking Moments
స్టాలిన్‌పై ఫైర్..

స్టాలిన్‌పై ఫైర్..

డీఎంకే యూత్ లీడర్ ఉదయనిధి స్టాలిన్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ కేసులో నిందుతుడు వారి పార్టీకి చెందిన వాడే ఇప్పుడు వారు ఏం చేస్తారు? ఉదయ నిధి స్టాలిన్ న్యాయం చేస్తాడా? ఆయన నోరు విప్పుతాడా? అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X