శృంగార తార జ్యోతిలక్ష్మి రీఎంట్రీ
ఒక తరాన్ని తన తన శృంగార నృత్య భంగిమలతో ఉర్రూతలూగించిన ఐటం బాంబు జ్యోతిలక్ష్మి. ఆమె గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నారు. వయస్సు మీదపడటంతో రిటైర్ మెంట్ ప్రకటించుకున్నట్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె తాజాగా ఓ తమిళ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ఎంపికయ్యారు. ఆ చిత్రం పేరు కోళి కూవదు. సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే టైటిల్ తో ప్రభు, సురేష్, లిజి హీరో హీరోయిన్లుగా గంగైయమరన్ దర్శకత్వంలో కోళి కూవదు చిత్రం రూపొం దింది. ఇప్పుడు అదే పేరుతో తాజాగా దర్శకుడు కెఐ రంజిత్ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పిడిచ్చిరికి చిత్రం ఫేమ్ అశోక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కేరళ మోడల్ హిజా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇక జ్యోతిలక్ష్మి కీలక పాత్ర హైలెట్ కానుందని చెప్తున్నారు. దీని గురించి దర్శకుడు తెలుపుతూ ప్రేమను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రం కోళి కూవదు అని తెలిపారు. తలైవన్ చిత్రంలో ఎంజీఆర్‌కు జంటగా నటించిన నటి జ్యోతిలక్ష్మి ఈ చిత్రంలో ఆయన వీరాభిమానిగా నటిస్తున్నారని చెప్పారు. అలాగే ఈ పాత్ర ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పుదుచ్చేరి, కడలూరు పరిసర ప్రాంతాల్లో చేపట్టామని వెల్లడించారు. ఈ చిత్రాన్ని బ్రైట్ మీడియా పతాకంపై ఎ.నాగరాజన్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











