వదినమ్మ జ్యోతికతో కలిసి కార్తి సినిమా చేయబోతున్నారా?
నటి జ్యోతిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకు సెట్టయ్యే సబ్జెక్టులు ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆమె తన భర్త సూర్యతో కలిసి సినిమా ఎప్పుడు చేస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కాంబినేషన్ సెట్టయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఆసక్తికర విషయం ఏమిటంటే.... జ్యోతిక తన మరిది కార్తితో సినిమా చేయబోతోందట. ఈ చిత్రంలో జ్యోతిక సోదరుడిగా కార్తి కనిపించబోతుండటం గమనార్హం. 'దృశ్యం' లాంటి థ్రిల్లర్ మూవీలు రూపొందించిన మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

తమిళ మీడియా వర్గాల ప్రకారం ప్రకారం... జ్యోతిక సోదరుడు సూరజ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. జ్యోతిక, కార్తి ప్రస్తుతం చేస్తున్న సినిమాల కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని తెలుస్తోంది.
కార్తి ప్రస్తుతం భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు ఆయన నటించిన 'ఖైదీ' విడుదలకు సిద్ధంగా ఉంది. జ్యోతిక కూడా మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. కార్తి నటించిన చివరి చిత్రం దేవ్ బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











