Suriya Jyothika భర్త సూర్యతో విడాకులు.... తొలిసారి నోరువిప్పిన జ్యోతిక!
ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లో ఒకరు సూర్య, జ్యోతిక. వీరు బయట కనిపిస్తే.. ఎప్పుడూ ఒకరిపై ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న సూర్య.. ఎప్పుడు తన భార్య గురించి తక్కువ చేసి మాట్లాడలేదు. ఇక తన భార్య తనకు టీచర్ అంటూ పలు సార్లు చెప్పుకువచ్చాడు కూడా. ఇక అలాంటి కపుల్స్... విడిపోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై తొలిసారిగా హీరోయిన్ జ్యోతిక స్పందించింది. సూర్యతో విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఒక్క పాన్ ఇండియా చిత్రం తీయకపోయినా.. ఆ స్థాయి గుర్తింపు, పాపులారిటీ ఉంది. ఆయన సినిమాలు.. తెలుగులోనూ రిలీజ్ అవుతాయనే సంగతి తెలిసిందే. గజినితో తెలుగులో అడుగుపెట్టిన సూర్య.. ఆ సినిమా హిట్ కావడంతో.. ఆయన తీసే ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూ వస్తుంది. ఇక తమిళ హీరో అయినప్పటికీ.. సూర్యకు తెలుగులో స్టార్ హీరోకు ఉన్న పాపులారిటీ ఉంది.

ముఖ్యంగా ఆయనకు అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువే. అయితే సూర్య.. హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు ప్రేమలో పడి అప్పట్లోనే ఒక్కటయ్యారు. ఇక వీరు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఓ పాప, బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే.. సూర్య, జ్యోతిక వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.
ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటపై ఇప్పటి వరకు ఒక్క ట్రోలింగ్ కూడా రాలేదు. అంతలా వీరు చాలా మందికి ఆదర్శం. ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కనిపించిన ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు. సూర్య స్టార్ హీరో అయినప్పటికీ.. భార్యపై ప్రేమను ఎప్పుడూ బయటపెడుతుంటాడు. ఇక తన భార్య తన టీచర్ అంటూ చాలా సార్లు చెప్పుకుచ్చాడు. అయితే ఈ జంటపై ఇటీవల కొన్ని రూమర్స్ వస్తున్నాయి. త్వరలో విడాకులు తీసుకుంటున్నరంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

అయితే ఈ ప్రచారంపై జ్యోతిక స్పందించింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతిక.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా మూడు సినిమాలు చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆమె.. తన విడాకులపై రియాక్ట్ అయింది. సినిమా షూటింగ్ కారణంగానే మేము ముంబైకి వచ్చామని... అలాగే పిల్లల చదువుల గురించి కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుందని వెల్లడంచింది. పిల్లల చదువులు పూర్తికాగానే తిరిగి తాము చెన్నై వస్తామని క్లారిటీ ఇచ్చింది.
అంతే కానీ తమ మధ్య ఎలాంటి వివాదాలు జరగడం లేదని క్లారిటీ ఇచ్చింది జ్యోతిక. ఇలా ముంబై వెళ్లడానికి గల అసలు కారణం చెప్పడంతో జ్యోతిక, సూర్య విడాకుల విషయంపై వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలింది. అవన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చింది.


Click it and Unblock the Notifications











