పెళ్ళితో వెండి తెరకు దూరమైన జ్యోతిక ...తాజాగా తన భర్త సూర్య తీస్తున్న చిత్రంలో నటిస్తోంది.'ఠాగూర్' సినిమాతో తెలుగు వారికి పరిచయమై 'మాస్' తో దగ్గరైన అందం జ్యోతిక. అలాగే 'చంద్రముఖి' తో అభినయానికి అర్ధం చెప్పిందామె. రవితేజా తో 'షాక్' సినిమా చేసిన తర్వాత ఆమె తెరపై కనిపించలేదు.తమళ హీరో సూర్యని పెళ్ళి చేసుకుని సెటిలైంది. సినిమాలకు దూరమయ్యింది. సంసార జీవితంలో లీనమై 'దియ' అనే చిన్నారికి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ పాప ఆలనా పాలనాలో లీనమైన ఆమె త్వరలో మళ్ళీ వెండితెరపై పలకరించబోతోంది. అదీ ఆడ పిల్లకు చదువు ఎంత అవసరమో చెబుతూ సాగే లఘు చిత్రంలోనట. దీన్ని ఆమె భర్త సూర్య నిర్మిస్తారట. ఎంతో మంది ఆడపిల్లలు చదువుకోకుండా వారి తల్లితండ్రులే అడ్డు పడుతున్నారని వారికి ఈ చిత్రం ద్వారా కనువిప్పు కలిగించాలన్నదే సూర్య ఆశయమట. అందుకే ఈ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తూ నటిస్తూ భార్యను నటించమని కోరారట. సామాజిక ప్రయోజనాత్మక చిత్రం కాబట్టి తమళ స్టార్ హీరోలు విజయ్, మాధవన్ కూడా రెండు ముఖ్య పాత్రలు పోషించడానికి ముందుకొచ్చారుట. దాంతో జ్యోతిక రీఎంట్రీ సంగతి ప్రక్కన పెట్టి రియల్ హీరోయిజం అంటే అదీ అని ఆ హీరోలని మెచ్చుకుంటున్నారట సినిమా వారు.