బూతా?.. మరి హీరోలు చెప్పినప్పుడు?: నాచియార్ వివాదంపై జ్యోతిక
Recommended Video

బాలా.. ఒక అసాధారణ దర్శకుడు. సాదాసీదా రొడ్డకొట్టుడు కథల జోలికి పోవడానికి ఏమాత్రం ఇష్టపనివాడు. సమాజపు అట్టడుగు జీవితాల్లోని అపసామాన్య వ్యక్తిత్వాలు, అందులోని యథార్థత.. బాలా సినిమాలకు కథాంశాలు. అందుకే ఆయన సినిమాల్లో సంభాషణలు కూడా పచ్చిగానే ఉంటాయి. ఇదే పరంపరలో ఆయన నుంచి రాబోతున్న మరో సినిమా 'నాచియార్'. ఇందులో జ్యోతిక చెప్పిన ఒక 'బూతు' డైలాగ్ పై పెద్ద దుమారమే రేగుతోంది. ఇప్పటి వరకు దానిపై స్పందించని జ్యోతిక తాజాగా నోరు విప్పారు..

జ్యోతిక కామెంట్..:
టీజర్‌లో నేను చెప్పిన డైలాగును వివాదం చేశారు. నిజానికి అలాంటి పదాన్ని చాలామంది హీరోలు ఇప్పటికే వాడేశారు. అప్పుడెవరూ దాని గురించి అడగలేదు. కానీ ఒక నటిగా నేను చెబితే మాత్రం ఇంత పెద్దది చేసి చూపిస్తున్నారు.

తగ్గించే మాట్లాడాను..:
'నాచియార్' కథ ప్రకారం సినిమాలో అలాంటి డైలాగ్స్ చాలానే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే.. ఆ పాత్ర అలాంటిది. కానీ చాలావరకు తగ్గించే మాట్లాడాను.

ఎందుకీ వివాదం:
నాచియార్ 'టీజర్'లో జ్యోతిక చెప్పిన 'తెవిదియా' అన్న పదంపై అక్కడి మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి బూతు పదాన్ని జ్యోతిక పలకడంపై వారు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టు మెట్లు కూడా ఎక్కింది.

రఫ్ లుక్‌తో జ్యోతిక:
'36 వయదినిలే' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ఇటీవల 'మగళీర్ మట్టుం'తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాల్లో హోమ్లీగా కనిపించిన అనుష్క.. 'నాచియార్'లో మాత్రం రఫ్‌గా కనిపించబోతోంది.

బాలా వెనక్కి తగ్గుతారా?:
సేతు,శివ పుత్రుడు , నేనే దేవుడ్ని , వాడు వీడు లాంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన బాలా ఇప్పుడు 'నాచియార్'తో రాబోతుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే జ్యోతిక చేత చెప్పించిన డైలాగ్ వివాదాస్పదం కావడంతో.. సినిమా నుంచి దాన్ని తొలగిస్తారా?.. లేక బాలా తన పంథానే కొనసాగిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











