Don't Miss!
- Sports క్లాసెన్‌కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మంచు లక్ష్మి, జ్యోతిక డాన్స్ అదిరిపోయిందిగా.... వీడియో వైరల్
నటి జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'కట్రిన్ మోళి'. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'తుమ్హారి సులు' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో మంచు లక్ష్మి కూడా నటిస్తున్నారు. హిందీ వెర్షన్లో విద్యా బాలన్ పోషించిన రేడియో జాకీ పాత్రను జ్యోతిక చేస్తుండగా, నేహా ధూపియా పోషించి రేడియో స్టేషన్ హెడ్ పాత్రను మంచు లక్ష్మి పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో జ్యోతిక, మంచు లక్ష్మి కలిసి మోహన్ లాల్ సూపర్ హిట్ సాంగ్ జిమ్మికి కమల్ అనే పాటకు డాన్స్ చేశారు. ఈ డాన్స్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఒక్క రోజులోనే దాదాపు 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా ద్వారా మంచు లక్ష్మి తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న మంచు లక్ష్మి అక్కడ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా గుడుపుతున్నారు.
మూల కథాంశం హిందీ నుంచి తీసుకున్నప్పటికీ తమిళ నేటివిటీకి తగిన విధంగా 'కట్రిన్ మోళి' స్క్రిప్టులో మార్పులు చేశారు. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక భర్త పాత్రను విధార్థ్ పోషిస్తున్నారు.
తమిళ హీరో సూర్యతో పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన జ్యోతిక పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె తన వయసుకు తగిన విధంగా సెలెక్టెడ్ స్క్రిప్టులు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. 'కట్రిన్ మోళి' నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.