Don't Miss!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో సూర్య నిర్మాతగా జ్యోతిక-రేవతి కాంబినేషన్లో కామెడీ ఫిల్మ్
సీనియర్ నటి రేవతి, జ్యోతిక కాంబినేషన్లో తమిళంలో కొత్త సినిమా ప్రారంభం అయింది. ఎస్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జ్యోతిక భర్త, ప్రముఖ తమిళ స్టార్ సూర్య నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. 2డి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై కామెడీ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ ఆదివారం మొదలైంది.
ఈ చిత్రంలో తమిళ కమెడియన్స్ యోగిబాబు, ఆనంద్‌రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా షూటింగ్ షెడ్యూలర్ ప్లాన్ చేశారు.
మరో వైపు జ్యోతిక.. కొత్త దర్శకుడు ఎస్ రాజ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మిస్తోంది. జ్యోతిక నటించిన చివరి చిత్రం 'కాత్రిన్ మోళి'(తుమారి సులు రీమేక్) బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
ఎస్.జె.సూర్య, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో రూపొందబోయే తమిళ చిత్రం 'ఉయర్నాథ మనితన్'లో కూడా జ్యోతికతో ముఖ్యమైన పాత్ర చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కాబోతోంది.
సూర్యతో పెళ్లి తర్వాత దాదాపు 8 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. '36 వయదినిలె' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్టులు ఎంచుకుంటూ జ్యోతిక వరుస చిత్రాలు చేస్తున్నారు.
నటన విషయంలో తన భర్త సూర్య నుంచి పూర్తి స్వేచ్ఛ, మద్దతు ఉందని, మేము ఎప్పుడూ తాము చేయబోయే సినిమాల కథల గురించి మాట్లాడుకుంటూ ఉంటామని, తనను మరిన్ని ప్రాజెక్టులు చేయాలని సూర్య ఎంకరేజ్ చేస్తూ ఉంటారని జ్యోతిక ఇటీవల ఓ ఇంటర్యూలో తెలిపారు.