కమల్‌తో పాటు వెండితెరపై కె.బాలచందర్‌

By Srikanya

K Balachander to act in Kamal's Uthama Villain
చెన్నై : తన గురువు కె.బాలచందర్‌తో వెండితెరను పంచుకోనున్నట్లు విశ్వనటుడు కమల్‌హాసన్‌ తెలిపారు. దీనికి సంబంధించి కమల్‌హాసన్‌ బుధవారం విడుదల చేసిన ప్రకటన మేరకు.. విశ్వరూపం-2కు అనంతరం తాను రమేష్‌అరవింద్‌ దర్శకత్వంలో 'ఉత్తమవిలన్‌' చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు.

ఇందులో తనతో పాటు తన గురువు కె.బాలచందర్‌ కూడా నటిస్తున్నారని, చిత్రంలోని పాత్రకోసం గడ్డం కూడా పెంచుతున్నానని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా మమ్ముటిని ఎంపిక చేశారు. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.

ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర రిలీజ్ హడావిడిలో బిజీగా ఉన్నారు. త్వరలో ఉత్తమ విలన్ తెరకెక్కనుంది. 'పంచతంత్రం'లో కమల్‌తోపాటు ఓ ముఖ్య పాత్ర పోషించారు రమేష్‌.

రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. '' నేను, కమల్‌ మంచి స్నేహితులు. కన్నడలో నేను తెరకెక్కించిన 'రామా శ్యామా భామా'లో కమల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన 'విశ్వరూపం 2' చిత్రీకరణ పూర్తి చేశారు. నేను కూడా కన్నడ సినిమాలను ఒప్పుకోలేదు. కమల్‌తో 'ఉత్తమ విల్లన్‌' తెరకెక్కించే పనుల్లో ఉన్నా. దీని స్క్రిప్ట్‌ను కమలే రాశారు. పలు సినిమాలలో ఆయనతో కలసి నటించిన అనుభవం ఉంది. మా అభిప్రాయాలను బాహాటంగా చర్చించుకుంటాం. మంచి స్నేహితుడు కావడంవల్ల అడ్వాంటేజ్‌ తీసుకోగలుగుతున్నాను''అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X