రజనీకాంత్‌తో ఇగోప్రాబ్లమ్స్‌పై కమల్ హాసన్ కామెంట్స్
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్, తనకు మధ్య కెరీర్ ప్రారంభంలో ఇగో ప్రాబ్లమ్స్ ఉండేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఓ టీవీ ఇంటర్య్వూలో కమల్ హీసన్ మాట్లాడుతూ....కెరీర్ ప్లారంభంలో తనకు, రజనీకాంత్ మధ్య ఇగో ఉండేదని, తన గురువు బాలచందర్ ఇద్దరి అహాన్ని అణచి వేసారని చెప్పుకొచ్చారు.
రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి దాదాపు 15కుపైగా చిత్రాల్లో కలిసి నటించారు. మొదటి సినిమా అపూర్వ రాగంగల్ కమల్ హాసన్ హీరోగా తెరంగ్రేటం చేసిన చిత్రం. ఆ తర్వాత బాలచందర్ వరుస చిత్రాల్లో కమల్, రజనీ కలిసి నటించారు. వారు ఇద్దరు కలిసి మూండ్రు ముదిచు, అవల్ అప్పదితాన్, పతినారు వయతినిలె, అవర్గల్, ఆడు పులి అతం, ఇలామై ఊంజల్ ఆడుకిరతు, థాయిల్లమల్ నన్నిలై, నినైథలే ఇనిక్కుం, అలవుద్దినుం అత్బుత విలక్కుం, తిలలు ముళ్ళు, అగ్ని సాక్షి, తదితర చిత్రాల్లో నటించారు.
"మా ఇద్దరి మధ్య అహం బాలచందర్ గారిచే అణచబడింది. మా ఇద్దరి మధ్య అప్పుడు గొప్ప పోటీ ఉండేది. అయినా మాలో ఎవరూ కూడా పడిపోలేదు'' అని కమల్ చెప్పుకొచ్చారు. ఎలాంటి వివాదం లేకుండానే తాము కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఇందుకు గల కారణం వివరిస్తూ...ఇద్దరం కలిసి నటించడం వల్ల రెమ్యూనరేషన్ రెండుగా విభజించ బడుతోంది. రెమ్యూనరేషన్ కోసం, సినిమా మార్కెట్ పెంచడం కోసం మేము అప్పుడు బిజినెస్ మేన్స్ లా ప్రవర్తించాం. అందుకే విడి విడిగా నటించాలని నిర్ణయించుకున్నాం అంటూ కమల్ హాసన్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











