»   » కే ప్రొడక్షన్స్‌ చేతికి ‘బాహుబలి-2’ రైట్స్, షాకిచ్చే రేటుకు

కే ప్రొడక్షన్స్‌ చేతికి ‘బాహుబలి-2’ రైట్స్, షాకిచ్చే రేటుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ దర్సకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన 'బాహుబలి' కేవలం తెలుగులో కాదు తమిళంలో కూడా కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. వూహించని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో భాగం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా.

మొదటి భాగంలో అసలు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపారన్న ప్రశ్నకు సమాధానం తెలియక తమిళ తంబీలు కూడా తలపట్టుకుని ఆలోచనలో పడ్డారు. ఈ ప్రశ్నకు బదులెప్పుడు తెలుస్తుందో? 'బాహుబలి- 2'ను ఎప్పుడు చూస్తామోనని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దాంతో తమిళ ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ చిత్రం బిజినెస్ పై క్రేజ్ ఏర్పటింది.


K Productions Rajarajan bags Baahubali 2 Tamil rights

'బాహుబలి' రెండో భాగం తమిళ హక్కులను 'కే ప్రొడక్షన్స్‌' సంస్థ అధినేత ఎస్‌ఎన్‌ రాజరాజన్‌ పొందారు. అంతేకాకుండా తమిళనాట తెలుగు వర్షన్‌ను విడుదల చేసే హక్కులను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు.


అందుతున్న సమాచారం ప్రకారం 52 కోట్లుకు ఈ రైట్స్ ని కె ప్రొడక్షన్స్ రాజరాజన్ పొందినట్లు తెలుస్తోంది. మరోవైపు రానా, సత్యరాజ్‌, రెజీనా నటిస్తున్న 'మడైతిరందు' సినిమాను కూడా ఆయన రూపొందిస్తున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' 'బాహుబలి - 2' హక్కులు పొందడం చాలా ఆనందంగా ఉంది. తొలిభాగం ఇక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండోభాగం కోసం ఎంతో ఆసక్తిగా వారు ఎదురుచూస్తున్నారు''అని తెలిపారు.

English summary
The Tamil theatrical rights of Baahubali 2 have been bagged by K Productions Rajarajan for a record Rs 52 crores, the highest ever in Kollywood, say trade sources.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu