మళ్లీ తెరపైకి సిల్క్ స్మిత బయోపిక్.. విషాదభరిత కథకు దర్శకుడు ఎవరంటే!
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై సిల్క్ స్మిత లాంటి తార మరొకరు లేరు.. ఇక ఎప్పటికీ రారు కూడా. సిల్క్ స్మిత లాంటి క్యారెక్టర్ పోషించాలంటే కూడా అది ఆషా మాషీ వ్యవహారం కాదు. ఆమెలా నటించడం అంటే కేవలం స్కిన్ షో చేయడమే కాదు.. కళ్లతోనే ఎన్నో హావభావాలను ప్రకటించాలి.. కళ్లతో మత్తు చల్లాలి. అది ఒక్క సిల్క్ స్మితతోనే సాధ్యం. సిల్క్ స్మితలో ఉన్న ఈ విశిష్ట లక్షణం ఇప్పుడున్న తారల్లో ఎవ్వరికీ లేదు.

డర్టీ పిక్చర్..
సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం డర్టీ పిక్చర్‌కు నేషనల్ వైడ్ పాపులార్టీ వచ్చింది. అయితే సిల్క్ స్మిత అంటే కేవలం స్కిన్ షో చేసే నటి అన్నట్టుగా ఆ సినిమా ప్రొజెక్ట్ చేసింది. డర్టీ పిక్చర్ సినిమా కాసుల వర్షం కురిపించింది.. విద్యా బాలన్‌కు మంచి పేరు వచ్చింది. కానీ సిల్క్ స్మిత అంటే ఏంటన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు.

అదో మిస్టరీ..
సిల్క్ స్మిత జీవితంలో ప్రేమ, పెళ్లి అనేవి ఎంతగా ప్రభావం చూపాయి. చివరి క్షణాల్లో సిల్క్ స్మిత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందే అందరికీ తెలిసిందే. అయితే సిల్క్ స్మితది హత్యో ఆత్మహత్యో అనేది మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ ఓ మిస్టరీనే. అయితే మళ్లీ సిల్క్ స్మిత జీవిత చరిత్రపై సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నాయి.

తమిళ దర్శకుడు..
తమిళ దర్శకుడు కేఎస్ మణికందన్ ఎంతో కాంట్రవర్సీ, క్లిష్టమైన సబ్జెక్‌ను ఎంచుకున్నాడు. అది కూడా తన రెండో సినిమాగా. మొదటి చిత్రం సంతానం లాంటి కమెడియన్‌తో చేసి రెండో ప్రాజెక్ట్‌గా సిల్క్ స్మితను ఎంచుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మణికందన్ మాట్లాడతూ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.
Recommended Video

దొరకడం కష్టమే..
అవల్ అప్పడితన్ అనే పేరును కన్ఫామ్ చేసిన మణికందన్ సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఆమెలోని ఆ హాట్ నెస్‌ను మ్యాచ్ చేసే వాళ్లు ఎవ్వరూ పుట్టలేదు.. ఆమె పాత్రను పోషించడానికి, న్యాయం చేయడానికి సరితూగే ఓ నటి కోసం మేమంతా వెతుకుతున్నామని చెప్పుకొచ్చాడు. మరి ఆ పాత్రకు ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











