For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అజిత్‌తో సినిమా చేస్తున్నట్లు బాలయ్య డైరెక్టర్ ట్వీట్.. అసలు విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్.!

  By Manoj
  |

  తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాదిలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకడు. వయసు పైబడుతున్నా.. కుర్ర హీరోలతో పోటీగా తనను తాను మలచుకుంటున్నాడు. అంతేకాదు, స్టైలిష్ నేచురల్ లుక్‌తో పాటు విలక్షణమైన నటనను కనబరిచే ఆయనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీనికితోడు అజిత్ చేస్తున్న ప్రతి సినిమాకూ ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమా చేస్తున్నట్లు బాలయ్య డైరెక్టర్ ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఇంతకీ ఏంటా మేటర్.? వివరాల్లోకి వెళితే...

  పవన్ కల్యాణ్‌ చేసేది ముందే చేసేశాడు

  పవన్ కల్యాణ్‌ చేసేది ముందే చేసేశాడు

  ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తున్న ‘పింక్' రీమేక్‌ను అజిత్ కూడా చేశాడు. ‘నెర్కొండ పార్వాయి' అనే పేరుతో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. చాలా కాలంగా సరైన హిట్ పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అజిత్‌కు ఈ సినిమా ఉపశమనం కలిగించింది. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  హిట్ ఇచ్చాడు.. ఛాన్స్ పట్టేశాడు

  హిట్ ఇచ్చాడు.. ఛాన్స్ పట్టేశాడు

  కెరీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ‘నెర్కొండ పార్వాయి'తో సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ హెచ్ వినోద్‌కు అజిత్ మరో అవకాశం ఇచ్చాడు. ఆ మూవీ తర్వాత వీళ్లిద్దరూ కలిసి ‘వాలిమై' చేస్తున్నారు. దీన్ని కూడా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో అజిత్ రెండు పాత్రలను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  అజిత్‌తో బాలయ్య డైరెక్టర్ సినిమా

  అజిత్‌తో బాలయ్య డైరెక్టర్ సినిమా

  ప్రస్తుతం ‘వాలిమై' షూటింగ్‌లో ఉన్న అజిత్.. బాలయ్యతో రెండు సినిమాలు చేసిన తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ట్విట్టర్‌లో సదరు దర్శకుడి పేరిట ఉన్న ఖాతా నుంచి ట్వీట్ రావడమే. అందులో ‘నేను అజిత్‌తో సినిమా చేస్తున్నాను. దీంతో 17 ఏళ్ల నా కల నెరవేరింది' అని రాసుకొచ్చారు.

  అసలు విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్.!

  అసలు విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్.!

  కేఎస్ రవికుమార్ పేరిట వచ్చిన ఆ ట్వీట్ కోలీవుడ్‌లో వైరల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో సీనియర్ డైరెక్టర్ రవికుమార్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా దీనిపై స్పందించాడు. ‘నేను అజిత్ సార్‌తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు నాకు ట్విట్టర్ అకౌంటే లేదు' అని చెప్పుకొచ్చారు. దీంతో అప్పటి వరకు ఖుషీ అయిన అజిత్ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు.

  Nandamuri Balakrishna, A Man With A Golden Heart

  17 ఏళ్ల అన్నదానితోనే దొరికిపోయారు

  కేఎస్ రవికుమార్ పేరిట వచ్చిన ఆ ట్వీట్ అబద్దమన్న విషయం అందులో ఉన్న ‘17 ఏళ్ల నా కల' అన్న దానితోనే తేలిపోయింది. ఎందుకంటే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి ‘విలన్' కాగా, మరొకటి ‘వరలారు'. ఈ రెండింటిలోనూ అజిత్‌ను ఎంతో హుందాగా చూపించాడు కేఎస్ రవికుమార్.

  English summary
  K. S. Ravikumar is an Indian film director and actor, primarily working in Tamil cinema. In a career spanning around 25 years, he has directed some of the most recognisable and well-known Tamil films of all time and is considered one of the most popular film makers in Tamil cinema.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X