»   » పెళ్లికి రాలేదనే కోపంతో రజనీ, విజయ్ సినిమాలను నష్ట పరుస్తున్నారా?

పెళ్లికి రాలేదనే కోపంతో రజనీ, విజయ్ సినిమాలను నష్ట పరుస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: తమిళ స్టార్ విజయ్ నటించిన 'తేరి' చిత్రం ఇటీవల విడుదలై తమిళనాడు బక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే చెంగల్పట్టు, పరిసర ప్రాంతాల్లో 60 థియేటర్లలో మాత్రం విడుదల కాకపోవడంతో చిత్రానికి నష్టం వాటిల్లిందని మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో చిత్ర నిర్మాత కలైపులి.ఎస్. థాను విచారం వ్యక్తం చేశారు.

  థియేటర్ల సంఘ కార్యదర్శి పన్నీర్‌ సెల్వం వల్ల కొన్ని సినిమాలకు ఏదో రూపంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అతని కూతురి పెళ్లికి రజనీకాంత, విజయ్‌ హాజరు కాలేదని, దాన్ని మనసులో పెట్టుకు నే ఇప్పుడు 'తెరి' విడుదల విషయంలో ఇబ్బంది పెట్టారన్నారు. రాబోయే 'కబాలి'కి కూడా ఏదో రూపంలో సమస్యని సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

  K.S.Thanu clarifies about the controversy regarding Theri's release in Chengalpet

  'తెరి' చిత్రాన్ని సత్యం, ఐనాక్స్‌, పీవీఆర్‌ వంటి కొన్ని థియేటర్లలో విడుదల చేశాను. 'ఆ థియేటర్ల కి ఒప్పందం ప్రకారం వెళ్లిన మీరు మా దగ్గరకు అదే ఒప్పందంతో ఎందుకు రాలేదు' అని చెంగలప్పట్టు థియేటర్‌ యజమాను లు నన్ను ప్రశ్నించారు. నిజమే.. అక్కడున్న థియేటర్ల తరహాలోనే మీరూ థియేటర్లను కట్టించారు. అయితే మీతో ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం వచ్చిన వసూళ్లను మాకు సరి గా అందించడం లేదు కదా! అలాంటప్పుడు మీ ఒప్పందం ప్రకారం ఎలా నడుచుకోగలను?' అని కోపంగా ప్రశ్నించారు థాను.

  'రామానుజం (థియేటర్‌ యాజమాన్య సంఘ మాజీ అధ్యక్షుడు) వంటి మనసున్న మేథావుల స్థానంలో ఇపుడు ఇలాంటి రౌడీలు వచ్చి కూర్చున్నారు. దీని వల్ల మాలాంటి నిర్మాత లు ఎంతో నష్టపోతున్నారు. మేమేమీ దోపిడీదారులం, హంతకులమో కాదని నిర్మాత కలైపులి థాను థియేటర్ల యజమానులపై విరుచుకుపడ్డారు. 'తెరి' విషయాన్నే తీసుకుంటే చెన్నైలో తొలి రోజే కోటి రూపాయిలు వసూలు చేసింది. సరైన ఒప్పందం ప్రకారం వెళ్లినా ఇబ్బంది పెట్టడానికి మేమేమీ దోపిడిదారులమో, హంతకులమో కాదు' అని కలైపులి.ఎస్.థాను వ్యాఖ్యానించారు.

  English summary
  Producer S.Thanu recently held a press conference to further clarify his position regarding the controversy surrounding the release of Theri in some parts of the Chengalpet district. As quoted by him, the rights for the film were sold by him to a Mumbai based company, who in turn had it sold to respective distributors such as SPI Cinemas.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more