రజనీ ఫ్యాన్స్ ఇలా ఊహించి ఉండరు..... ‘కాలా’ ముందుకు, ‘2.0’ వెనక్కి!

By Bojja Kumar

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన '2.0' చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ ఈ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం వేసవిలో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించినా పోస్టు ప్రొడక్షన్ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేక పోవడంతో మళ్లీ వాయిదా పడింది. అసలు ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి. దీంతో 'కాలా' చిత్రం గురించి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.

Recommended Video

Rajini 'Kaala' Breaks kabali Records దీంతో రజనీ టాప్ లేపడం ఖాయం..
 ‘2.0' ఇప్పుడు లేనట్లే

‘2.0' ఇప్పుడు లేనట్లే

‘2.0' మూవీ విడుదల ఇప్పట్లో లేనట్లే అని తేలిపోయింది. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమాను జులై లేదా ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. అయితే వారికి ఉత్సాహాన్ని ఇచ్చే మరో వార్త తెరపైకి వచ్చింది.

 రజనీకాంత్ ‘కాలా'

రజనీకాంత్ ‘కాలా'

చాలా రోజుల క్రితమే ‘2.0' షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తర్వాత ‘కబాలి' డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ కాంత్ ‘కాలా' చిత్రం చేశారు. వాస్తవానికి ఈ చిత్రం ‘2.0' విడుదల తర్వాతే వస్తుందని అంతా భావించారు. అయితే ఆ సినిమా విడుదల లేటవుతుండటంతో దీనికంటే ముందే ‘కాలా' చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘కాలా' రిలీజ్ డేట్

‘కాలా' రిలీజ్ డేట్

‘కాలా' చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 ముంబై నేపథ్యంతో ‘కాలా'

ముంబై నేపథ్యంతో ‘కాలా'

ముంబై మురికవాడ నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘కాలా' డబ్బింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్ర విడుదల హక్కులను ‘2.0' నిర్మాణ సంస్థ లైకా సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదలపై అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది.

‘కాలా'పై అంచనాలు భారీగా

‘కాలా'పై అంచనాలు భారీగా

కబాలి చిత్రం తర్వాత రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్‌లో రెండో చిత్రంగా ‘కాలా' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి, నానా పాటేకర్, సముద్రఖని తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X