అదీ రజనీ స్టామినా అంటే....శాటిలైట్స్ రైట్స్‌ కోసం కోట్లు కుమ్మరించిన స్టార్ టీవీ!

By Bojja Kumar

సౌతిండియాలో రజనీకాంత్ సినిమాలకు ఉన్న క్రేజ్ మరే హీరో సినిమాలకు ఉండదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా రజనీకాంత్ సినిమాలు భారీ బిజినెస్ చేస్తుంటాయి. కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాదు, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోతూ ఉంటాయి.

'కబాలి' ఫేం పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కాలా' శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. హిందీ లీడింగ్ ఎంటర్టెన్మెంట్ చానల్ స్టార్ టీవీ వారు కాలా శాటిలైట్ రైట్స్ రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

‘Kaala’ satellite rights Rs 75 Cr

2.0, బాహుబలి తర్వాత సౌతిండియాలో రికార్డు స్థాయిలో శాటిలైట్ రైట్స్‌కు ధర పలికింది ఈ చిత్రానికే అంటున్నారు. ఇంతు ముందు రజనీ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ '2.0' శాటిలైట్ రైట్స్ రూ. 108 కోట్లకు అమ్మడు పోయింది. ఇందులో రజనీతో పాటు అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ లాంటి స్టార్స్, టాప్ డైరెక్టర్ శంకర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఉండటం వల్ల అంత భారీ మొత్తం పలికింది. అయితే 'కాలా' చిత్రంలో రజనీతో పాటు నానా పాటేకర్, హ్యూమా ఖురేషి లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటంతో ఈ స్థాయి ధర పలికినట్లు భావిస్తున్నారు.

కాలా చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా హీరో ధనుష్ తన సొంత బేనర్ వండర్‌బార్ ఫిల్మ్స్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీతో పాటు నానా పాటేకర్, హ్యూమా ఖురేషి, సముద్రఖని, ఈశ్వరి రావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కించారు. ఏప్రిల్ 27న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X