కాలా పాటల పండగ రేపే.. సమయం ఎప్పుడో తెలుసా?
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా సినిమా కాలా. రజినీకాంత్ అల్లుడు హీరో అయిన ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ 'వన్డర్ బార్' పతాకం పై ఈ సినిమాను నిర్మించడం జరిగింది. పా.రంజిత్ దర్శకత్వం లో నిర్మిస్తున్న 'కాలా' సినిమా పాటలు రేపు (మే 9 వ తేదీన) ఉదయం 9 గంటలకు విడుదల కాబోతున్నాయి.
కబాలి సినిమాకు సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నడు. కాలా చిత్రంలోని పాటలు అభిమాలతో పాటు అందర్నీ ఉర్రూతలూగిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంతోష్ నారాయణ్, రజినీకాంత్ కలయికలో వచ్చిన కబాలి సినిమా పాటలు ఎంత పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే స్థాయిలో ఈ పాటలు ఉండబోతున్నాయి.

ఇటీవల విడుదలైన కాలా ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది. ట్రైలర్ కు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. రజిని అభిమానులతో.. టైటిల్ సాంగ్ కు కోరస్ పాడించాడట సంతోష్ నారాయణ్. జూన్ 7 న కాలా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











