twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kaappaan Full Movie Leaked Online: రిలీజ్ రోజే సూర్యకు తమిళ్ రాకర్స్ షాక్

    |

    ప్రముఖ తమిళ నటుడు సూర్య నటించిన తమిళ చిత్రం 'కాప్పన్'(తెలుగులో 'బందోబస్తు') శుక్రవారం(సెప్టెంబర్ 20) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంపై తమిళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే, అన్ని సినిమాల్లానే ఈ చిత్రం కూడా పైరసీ బారిన పడింది.

    పూర్తి సినిమా పెట్టేశారు..

    పూర్తి సినిమా పెట్టేశారు..

    చిత్ర సీమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పైరసీ. గత కొంతకాలంగా అనేక పైరసీ బారినపడ్డాయి. తాజాగా, వచ్చిన సూర్య సినిమా ‘కాప్పన్' కూడా విడుదలైన రోజే తమిళ్ రాకర్స్ తన వెబ్‌సైట్‌లో లీక్ చేసింది. పూర్తి సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టడంతో తొలి రోజుల కలెక్షన్లతోపాటు మిగితా రోజుల కలెక్షన్లను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

    తమిళ్‌లో హిట్.. తెలుగులో..

    తమిళ్‌లో హిట్.. తెలుగులో..

    కాప్పన్ తమిళంలో మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే, తెలుగులో మాత్రం ‘బందోబస్తు'గా విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, సూర్యకు అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉండటంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

    సూర్య నట విశ్వరూపం..

    సూర్య నట విశ్వరూపం..

    కాప్పన్ చిత్రంపై సినిమా చూసిన పలువురు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. తమిళ చిత్ర సీమలో వచ్చిన గొప్ప చిత్రాల్లో కాప్పన్ ఒకటని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. సూర్య మరోసారి అవార్డులు గెలుచుకునే అవకాశం ఉందని, ఆయన నట విశ్వరూపాన్ని చూపించారని ప్రశంసించారు.

    రైతుల బాధ తెలిసింది..

    రైతుల బాధ తెలిసింది..

    ఎంటర్టైన్మెంట్ తోపాటు థ్రిల్లింగ్‌గా ఉందని వ్యాఖ్యానించాడు మరో నెటిజన్. పులిమురగన్ మోహన్ లాల్ కూడా సూర్యతోపాటు బ్రిలియంట్‌గా చేశారని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రైతుల సమస్యల గురించి చాలా బాగా చెప్పారని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. వారి బాధను అర్థం చేసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడాలని తెలిపాడు. కేవీ ఆనంద్ చిత్రాన్ని అద్భుతంగా తీశారని చెప్పుకొచ్చాడు.

    English summary
    Kaappaan, the big-budget movie, too has been exposed to the biggest threat that the industry has been facing since years. Piracy that has been affecting each and every film has not spared Kaappaan as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X