twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య అదరగొట్టారు... ఆసక్తి రేపుతున్న కాప్పన్ (బందోబస్త్) ట్రైలర్!

    |

    సూర్య హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం 'కాప్పన్'. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో తమిళ నటుడు ఆర్య నటిస్తున్నారు. సెప్టెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో ప్రమోషన్స్ జోరు పెంచారు.

    సూర్య అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ బుధవారం సాయంత్రం 'కాప్పన్' అఫీషియల్ ట్రైలర్ విడుదల చేశారు. యాక్షన్, ఎమోషన్స్, రొమాంటిక్ సీన్లులతో ఉన్న ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

    Kaappaan Trailer Is Out

    కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు ఈ చిత్రాన్ని 'బందోబస్త్' పేరుతో నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ రెండో వారంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ప్లాన్ చేశారు.

    ఈ చిత్రంలో కమాండోగా, రైతుగా సూర్య కనిపించబోతున్నాడు. ఆల్రెడీ విడుదలైన తెలుగు టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి, రైటర్: పి.కె.పి & శ్రీ రామకృష్ణ, లిరిక్స్: చంద్రబోస్, వనమాలి, ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హ్యారీస్ జైరాజ్, నిర్మాత: సుభాస్కరణ్, దర్శకత్వం: కె.వి. ఆనంద్.

    English summary
    Kaappaan, starring Suriya and Mohanlal in the lead roles, is one among the most-awaited Tamil movies of the month. Now, team Kaappaan has unveiled a real special gift box in the form of the first official trailer, which has hit the online circuits. Kaappaan trailer hit the online circuits at 7 PM this evening (September 04, 2019) through the official YouTube channel of Lyca Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X