Just In
- 28 min ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 44 min ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
- 2 hrs ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 2 hrs ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
Actress: స్టార్ హోటల్ లో చిత్రాతో ఏం జరిగిందో మొత్తం చెప్పాడు, సీక్రెట్ గా రికార్డు చేసి రిలీజ్ చేసిన ఫ్రెండ్
- Finance
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువ
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ కబాలి’పై ఇంకో పిటీషన్, రజనీకి కోర్టు నోటీసులు
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి'కి కంటిన్యూగా కోర్టు కష్టాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితమే..టిక్కెట్ల విషయమై వేసిన పిటీషన్ సమస్య తీరిందనే సమయానికి రేపు( శుక్రవారం) విడుదల కాకుండా నిలిపివేత ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుక్ర ఫిలిమ్స్ పార్టనర్ ఆర్.మహాప్రభు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం అందరినీ షాక్ కు గురి చేసింది.
ఆయన తన పిటీషన్ లో... గతంలో రజనీకాంత్ నటించిన 'లింగ' సినిమాను పంపిణీ చేసిన తమకు తీవ్రనష్టం వాటిల్లిందని, ఆ సమయంలో నష్టపరిహారం చెల్లిస్తానని ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, హీరో రజనీకాంత్‌లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
అయితే ఇప్పటికీ తనకు ఇంకా రూ.89 లక్షలు చెల్లించాల్సి ఉందని, ఈ డబ్బులు చెల్లించిన తరువాతే 'కబాలి' సినిమా విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ విచారణకు స్వీకరించి కబాలి హీరో రజనీకాంత్, నిర్మాత కలైపులి ఎస్.థానులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టనుంది.
ఇంకో కేసు..
రజనీ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో కబాలి టికెట్ల విషయంలో రేట్లు భారీగా ఉన్నాయి. టిక్కెట్ కు మూడు రెట్లు ధరలతో అమ్మకాలు జరుగుతున్నాయి. చాలా థియేటర్లలో వరుసగా మూడు రోజుల వరకూ టికెట్లు బుక్ అయిపోయాయి. అందుకు మఖ్య కారణం కార్పొరేట్ కంపెనీలు. అవి తమ ఉద్యోగుల కోసం ముందుగానే టికెట్లను బుక్ చేసుకున్నాయి.
అయితే 22న ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లకు పైగా ఈ సినిమా విడుదల కానుంది. పైగా చెన్నైలో కబాలి ఫస్ట్ రోజున సినిమా చూసేందుకు అందరికీ సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ల రేటు విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే ఎక్కువ రేట్లతో టికెట్లు అమ్ముతున్నారని ఓ అభిమాని కోర్టులో కేసు వేశాడు. వాదనలను విన్న చెన్నై కోర్టు కేసును కొట్టివేసింది.