twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది 'కబాలి' ఆఫీస్: వీళ్లేం చెప్తున్నారో వింటే ఆశ్చర్యపోతారు (వీడియో)

    By Srikanya
    |

    బెంగుళూరు: కబాలి .. రజినీకాంత్ మాఫియా డాన్‌గా నటించిన ఈ చిత్రం జూలై 22న అంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ల కోసం అభిమానులు నిద్రాహారాలు మాని ప్రయత్నిస్తున్నారు. మరో ప్రక్క కబాలి క్రేజ్ ని ఓ సెలబ్రేషన్స్ లాగ కార్పోరేట్ ఆఫీసులు సైతం చేసుకుంటున్నాయి. అన్ని కబాలి ఆఫీసులుగా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

    అలా ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ పోర్టల్స్ లో అగ్రగామిగా ఉన్న వన్ ఇండియాకు ఈ మేనియా పాకింది. అక్కడ ఆఫీసులో కబాలి గురించి జరుగుతున్న చర్చ, వారంతా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైనం మీరు ఇక్కడ చూడవచ్చు.

    కబాలి క్రేజ్ పెరగడంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. ప్రత్యేకంగా నిర్మాతలు ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టకుండానే మూవీపై పెరుగుతున్న క్రేజ్‌ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇక కబాలి చిత్రం 500 కోట్ల కలెక్షన్లు ఈజీగా సాధిస్తోందని నిర్మాత ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు.

    మరో ప్రక్క కబాలి విడుదల రోజు పనిదినం కావడంతో ఆ చిత్రా న్ని చూడటానికి పలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు సామూహికంగా సెలవు పెట్టాలని నిర్ణయించుకొన్నారట. ఈ విషయాన్ని తెలుసుకున్న సంస్థలు చేసేదేమిలేక ఈ నెల 22న సెలవు దినంగా పాటించాలని నిర్ణయించాయి.

    ఇక తమిళనాడులో ఈ చిత్రం క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోయంబత్తూరులో ఓ కోలివుడ్ కేఫ్‌ను కబాలి పోస్టర్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రజనీ ఫోటోలతో సుందరంగా అలకరించారు. కబాలి పంచ్ డైలాగ్‌లను గోడలపై రాయడంతో రజినీ అభిమానుల్లో ఆనందపడిపోతున్నారు. సూపర్ స్టార్ జీవిత విశేషాలను కూడా కేఫ్‌లో అందుబాటులో ఉంచారు. ఆరడుగుల కబాలి పోస్టర్‌ను ఉంచడంతో అభిమానులు సెల్ఫీలు దిగుతున్నారు.

    ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెలుపు, ఎరుపు బార్డర్స్ ఉండే విధంగా నీలం రంగు ధోతిలకు, కబాలి పోస్టర్‌లో టీ షర్ట్స్ తయారు చేయాలని తిర్పూర్ గార్మెంట్స్‌కు వందలాది ఆర్డర్లు ఇచ్చారు.

    సినిమా విడుదల రోజున భారీ ఎత్తున పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు అభిమానులు. కబాలి సక్సెస్‌కు సూపర్ స్టార్ అభిమానులు అన్ని విధాలా శ్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేసుకున్నారు అభిమానులు.

    English summary
    Rajinikanth is back and yet again he brings with him, a whole new level of madness. The Kabali craze, as the phenomenon is being referred to, has loomed large over the country, breaking and...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X