»   »  రజనీ యూఎస్ ట్రిప్: మెడికల్ వాస్తవాలు లీక్ చేసిన బ్రదర్!

రజనీ యూఎస్ ట్రిప్: మెడికల్ వాస్తవాలు లీక్ చేసిన బ్రదర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ వెళ్లినప్పటి నుండి రకరకాల ఊహాగానాలు, గాసిప్స్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన యూఎస్ వెళ్లింది ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేయడానికే అని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే రజనీవెళ్లి చాలా రోజులు కావడం, గతంలో ఆయన ఎప్పుడూ ఇలా విదేశీ టూర్లకు వెళ్లిన దాఖలాలు లేక పోవడంతో అభిమానులు, సినీ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి.

రజనీకాంత్ అనారోగ్యంతొ బాధ పడుతున్నారని, ఆయన వెళ్లింది విహార యాత్రకు కాదని..... తన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై అమెరికాలోని అత్యాధునిక ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికే అనే విషయం బయటకు పొక్కింది. ఓ వైపు రజనీకాంత్ 'కబాలి' రిలీజ్ ఆనందంలో ఉన్న అభిమానుల్లో ఈ వార్తలు కలకలం రేపాయి.

 'Kabali' Is Good, Rajinikanth Is Undergoing Medical Tests In US: Actor's Brother

మరో వైపు రజనీకాంత్ వెళ్లింది కిడ్నీ మార్పిడి కోసం అనే రూమర్స్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ ఆయన ప్రతినిధులు మాత్రం రజనీకాంత్ యూఎస్ఏలో ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవుతున్నారని, రెస్టు తీసుకుంటున్నారని చెప్పారు. నిజంగానే రజనీకి కిడ్నీ మార్పిడి జరిగిందా? అందుకే అక్కడ ఇన్ని రోజులు రెస్టు తీసుకుంటున్నారా? అనేది తేలాల్సి ఉంది.

తాజాగా రజనీ యూఎస్ పర్యటనకు సంబంధించి ఓ అఫీషియల్ ప్రకటన ఆయన సోదరుడి నుండి వచ్చింది. రజనీకాంత్ ఫ్యామిలీ మెంబర్, సోదరుడు అయిన సత్యనారాయణ తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ.....రజనీకాంత్ యూఎస్ వెళ్లింది మెడికల్ టెస్టుల కోసమే అని తేల్చి చెప్పారు. కబాలి సినిమా రిలీజ్ ముందు ఆయన తిరిగి తమిళనాడు చేరుకుంటారని తెలిపారు. అంతకు ముందు ఆయన తంజావూరులోని శివాలయంలో రజనీ ఆరోగ్యం బావుండాలని పూజలు చేయించారు.

English summary
Superstar Rajinikanth has gone to the United States for some medical tests and he will be back in Tamil Nadu ahead of the release of his much-expected flick Kabali, a family member has said. "He has gone for (medical) test to USA. He will be back before the release of the movie (Kabali) which has been scheduled for July 15," elder brother of Rajinikanth, Sathyanarayana, told reporters in Tanjore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu