రజనీ ‘కబాలి’ వరల్డ్ రికార్డ్, 12న భారీ వేడుక...
హైదరాబాద్: మే 1న విడుదలైన కబాలి టీజర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ టీజర్ ని ఇప్పటి వరకు 23 మిలయన్ల కన్నా ఎక్కువ మందే వీక్షించారు. తెలుగు, తమిళంలో ఈ టీజర్ రిలీజ్ చేసారు. ఒక్క తమిళం టీజర్ కే 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తెలుగులో 3 మిలియన్లకుపైగా చూసారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ టీజర్ కు ఈ రేంజిలో రెస్పాన్స్ రాలేదట. అందుకే దీన్ని వరల్డ్ రికార్డ్ అంటున్నారు అభిమానులు.
టీజర్ కు భారీ స్పందన రావడంతో సంతోషంగా ఉన్న చిత్ర యూనిట్ జూన్ 12న ఆడియో వేడుకను భారీగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయానని అఫీషియల్ గా ప్రకటించారు. మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కబాలి చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు.

రజనీకు ఒక్క తమిళనాటే కాక ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండడంతో ఈ సినిమాను వీలైనంత మేరకు అన్ని ఏరియాల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ ఫాలోయింగ్ బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని ఇప్పటికే అనేక భాషల్లో డబ్ చేస్తున్నారు. ఈ జాబితాలోకి మరో భాష వచ్చి చేరింది. మలేషియాలో తమిళ చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'కబాలి'ని మలయ్( మలేషియా బాష)లోకి అనువదిస్తున్నారు.
దీంతో మలయ్ బాషలోకి డబ్ అయిన తొలి తమిళ చిత్రంగా కబాలి రికార్డు సృష్టించింది. మలేషియా మీడియా కంపెనీ అయిన మాలిక్ స్ట్రీమ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని మలేషియాలో విడుదల చేయనుంది.
నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తుండగా..కథ అండర్ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











