twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ 'కబాలి' తెలుగు వెర్షన్ టైటిల్ ఇదే

    By Srikanya
    |

    చెన్నై : రజనీకాంత్ కేవలం తమిళంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో రజనీకు వీర ఫాలోయింగ్ ఉంది. దాంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన చిత్రాలు రిలీజ్ భారీగా ప్లాన్ చేస్తూంటారు. తాజాగా ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం 'కబాలి' . ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'మహదేవ' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ త్వరలో రానుంది.

    ఇక 'కబాలి' ఫస్ట్ లుక్ మొన్న వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసారు దర్శక,నిర్మాతలు. ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

    Kabali Telugu version titled as Mahadev

    కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

    ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. ఆమె రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. అలాగే దర్శకుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు.

    తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్‌' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్‌ ఒరిజినల్‌ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

    English summary
    Tamil Superstar Rajinikanth is busy working for his new venture 'Kabali'. However, the makers have changed the title for its Telugu version to make sure Tamil nativity not to be shown its effect on Telugu version. As per buzz the title has been confirmed as 'Mahadev' for Telugu version of the film and the posters with the film's title will be out soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X