మణిరత్నం నివాసం వద్ద మళ్లీ ఆందోళన
ఇంతకుముందే ఈ చిత్రంలోక్రైస్తవులను కించపరిచే సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాలని కోరుతూ ఇండియా క్రైస్తవ జననాయగ కట్చి గత సోమవారం నగర పోలీసు కమిషనర్ జార్జ్‌కి ఓ ఫిర్యాదుపత్రం అందించింది. అందులో ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొంటూ.. తమ మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలను తొలగించటంతోపాటు దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే... ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైదంది. మణిరత్నం దర్శకత్వంలో గౌతమ్‌కార్తీక్, తులసి జంటగా నటించిన ఈ చిత్రం ఒకటో తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో క్రైస్తవులను కించపరిచే సన్నివేశాలున్నట్లు జాన్సన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో మంగళవారం ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. చిత్ర ప్రదర్శనను వెంటనే ఆపేయాలని కోరారు.
కడలి చిత్రాన్ని మణిరత్నం యాక్షన్, పంచ్ డైలాగులు లాంటి కమర్షియల్ అంశాలతో కూడిన అందమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అర్జున్, అరవింద స్వామి, గౌతం పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రాజీవ్ మీనన్ కెమెరా, జయమోహన్ స్క్రిప్టు, మణిరత్నం దర్శకత్వం వెరసి ఈ సినిమాకు అందరూ టాప్ టెక్నీయన్స్ పని చేసారు. అయినా ఫలితం లేదు. దీనికి తోడు ఈ వివాదం ఇప్పుడు పంపిణీదారులను భయపెడుతోంది.
కడలి సినిమా మొత్తం మత్స్యకార గ్రామం నేపథ్యంలో ఒక క్రైస్తవ జాలరి జీవితం చుట్టూ, క్రైస్తవ జాలరి కుర్రాడు థామస్.... బిట్రిస్ అనే అమ్మాయిని కలుసుకోవడం వల్ల అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది సినిమాలో చూపించారు. మంచికి చెడుకు మధ్య పోరాటం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే విషయాలలో ప్రేమకథను మిలితం చేసి చూపించాడు దర్శకుడు మణిరత్నం. మంచి, చెడు అనే విషయాలను బేస్ చేసుకుని బైబిల్‌లోని ధీమ్స్ ను తన సినిమాలోని పాత్రల్లోకి జొప్పించి ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేసాడు.


Click it and Unblock the Notifications












