తెలుగు చిత్రం రీమేక్ లో ‘కడలి ’హీరో
చెన్నై: మణిరత్నం 'కడలి' చిత్రంతో పరిచయమైన గౌతమ్ కార్తీక్ మరో చిత్రం చేజిక్కుంచుకున్నాడు. తెలుగులో విజయవంతమైన 'అలా మొదలైంది' తమిళ రీమేక్ లో నటించటానికి కమిటయ్యారు. ఈ చిత్రాన్ని రవి త్యాగరాజన్ డైరక్ట్ చేయనున్నారు. ఇమామ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మిగాతా కాస్టింగ్ డిటేల్స్ వెలవడనున్నాయి. ఇక గౌతమ్ మరో ప్రక్క ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో చిత్రం కూడా ఒప్పుకున్నారు.
ఇక నాని, నిత్యా మీనన్ కాంబినేషన్ లో నూతన దర్శకురాలు బి.వి. నందినిరెడ్డి రూపొందించిన చిత్రం 'అలా మొదలైంది '. ఈ చిన్న చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ అరకోటికి పైగా అమ్ముడైనట్లు సమాచారం. తమిళంలో రెగ్యులర్ సినిమాలు తీస్తున్న ఓ లీడింగ్ ప్రొడ్యూసర్ ఈ రైట్స్ ని తీసుకున్నారు.
అలాగే మళయాళ పరిశ్రమనుంచి కూడా రీమేక్ రైట్స్ కు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం హిట్ కు నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ కారణం చెప్తూ..ఇది సింపుల్ పాయింట్ మీద తీసిన సినిమా. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్‌ప్లే. స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం అందుకే వర్కవుట్ అయింది అన్నారు.
చిత్ర కథ ప్రకారం... గౌతమ్(నాని) ఇష్టపడ్డ అమ్మాయి సిమ్రాన్(కీర్తి కర్బంధ) అతనికి హ్యాండిచ్చి ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి ప్రెండ్స్ బలవంతం మీద వెళ్ళిన గౌతమ్ కి అక్కడ నిత్య(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. నిత్య ది కూడా సేమ్ సమస్యే. ఆ పెళ్ళికొడుకు(డాక్టరు) ఆమెకు హ్యాండిచ్చి సిమ్రాన్ ని పెళ్ళి చేసుకుంటూంటాడు. దాంతో ఒకే సిట్యువేషన్ లో ఇరుక్కున్న ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని ప్రెండ్స్ అవుతారు. అక్కడ నుంచి రకరకాల సంఘటనలతో వీరిద్దరి మధ్యా ప్రేమ మొలకెత్తుతుంది. అయితే వీళ్ళు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునేలోగా వీరికి రకరకాల మలుపులు, మనుష్యులు అడ్డంగా నిలుస్తారు. ఈ క్రమంలో వీటిన్నటినీ అధిగమించి వీరిద్దరూ ఎలా కలుస్తారనేది సరదాగా రూపొందించిన కథనం.


Click it and Unblock the Notifications











