మణిరత్నం ఇంటిని ముట్టడించిన డిస్ట్రిబ్యూటర్స్
మణిరత్నం తాజా చిత్రం 'కడలి'. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం రిలీజ్ నాటి నుంచీ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైదంది. మణిరత్నం దర్శకత్వంలో గౌతమ్‌కార్తీక్, తులసి జంటగా నటించిన ఈ చిత్రం ఒకటో తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో క్రైస్తవులను కించపరిచే సన్నివేశాలున్నట్లు జాన్సన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో మంగళవారం ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. చిత్ర ప్రదర్శనను వెంటనే ఆపేయాలని కోరారు. మరో ప్రక్క ఈ చిత్రంలోక్రైస్తవులను కించపరిచే సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాలని కోరుతూ ఇండియా క్రైస్తవ జననాయగ కట్చి సోమవారం నగర పోలీసు కమిషనర్ జార్జ్‌కి ఓ ఫిర్యాదుపత్రం అందించింది.
అందులో ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొంటూ.. తమ మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలను తొలగించటంతోపాటు దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరారు. 'రావణ్' సినిమా ప్లాపు తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా సమయం తీసుకున్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎట్టకేలకు 'కడలి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు కార్తీక్ తనయుడు గౌతం, రాధ కూతురు లసిలను హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు తీసిన మణిరత్నం సినిమాలంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడం సహజమే. కడలి చిత్రంపై కూడా అదే తరహా ఆసక్తి నెలకొంది. అయితే అందరి అంచనాలను నీరుగారుస్తూ ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications












