»   » రామ్ చరణ్ పంక్షన్ కి కాజల్ ఎగ్గొట్టడానికి కారణం అదేనా?

రామ్ చరణ్ పంక్షన్ కి కాజల్ ఎగ్గొట్టడానికి కారణం అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్ లో మెరుపు అనే చిత్రం ప్రారంభమై ఆగిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు కాజల్ డేట్స్ ఎడ్జెస్టు చేయలేక ఆగిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ ఆమెను తన తాజా చిత్రం రచ్చ కోసం అడిగారు. కానీ ఆమె నిక్కచ్చిగా తాను డేట్స్ ఇవ్వలేనని చెప్పేసింది. దాంతో రామ్ చరణ్, కాజల్ మధ్య కోల్డ్ వార్ స్టార్టయింది. అయితే చరణ్ పుట్టినరోజు సమయంలో ఆమె అమెరికా వెళ్ళి మరీ అలక తీర్చిందని వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా జరిగిన మగధీర తమిళ డబ్బింగ్ చిత్రం 'మావీరన్‌' ఆడియో పంక్షన్ కి ఆమె డుమ్మా కొట్టింది. అల్లు అరవింద్ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించినా ఆమె రాలేదు. దాంతో అదో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ..తమిళ మగధీరుడూ తప్పకుండా విజయం సాధిస్తాడు. నాకు చిన్నప్పట్నించీ కమల్‌హాసన్‌ అంటే ఇష్టం. ఆయన చిత్రాలు ఎన్నో చూశాను. కమల్‌కి పెద్ద అభిమానిని అన్నారు.

English summary
Kajal Agarwal who is the female lead of Tamil Magadheera was absent for the audio release function that was held in Chennai. The reason heard for this is- Nothing going well between Ram Charan and Kajal as she refused to transfer the dates of Merupu to Rachcha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu