»   » రాజమౌళి,ప్రభాస్ చిత్రంలో ఆమే హీరోయిన్

రాజమౌళి,ప్రభాస్ చిత్రంలో ఆమే హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో కె.రాఘవేంద్రరావు ఓ భారీ చిత్రం నిర్మించటానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నే రాజమౌళి ఎంపికచేసినట్లు సమాచారం. మగధీరతో స్టార్ ని చేసిన రాజమౌళి అడగ్గానే ఆమె డేట్స్ ను బల్క్ గా ఇవ్వటానికి సిద్దపడింది. ప్రభాస్ హీరోగా రూపొందే ఈ చిత్రం ఈగ పూర్తికాగానే మొదలవుతుంది. అందులోనూ ప్రభాస్, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన డార్లింగ్, మిస్టర్ ఫెరఫెక్ట్ హిట్టవటం కూడా ఈ కాంబినేషన్ ని రిపీట్ చేయటానికి కారణమని తెలుస్తోంది.ఇక కాజల్ ప్రస్తుతం హిందీలో చేసిన సింగం పెద్దగా ఆడకపోవటం, దడ చిత్రం ఫెయిల్యూర్ కావటంతో కొద్దిగా డిప్రెస్ అయింది. అయితే రాజమౌళి ఆఫర్ ఆమెకు ఊరట ఇచ్చినట్లు అయింది. ఇక రాజమౌళి చిత్రం కోసం ప్రభాస్ సైతం ఏ చిత్రమూ ఒప్పుకోకుండా ప్రస్తుతం చేస్తున్న రెబెల్ చిత్రం పూర్తి చేసి డేట్స్ ఖాళీగా పెట్టుకున్నారు.రెబెల్ చిత్రాన్ని కాంచనతో హిట్టు కొట్టిన లారెన్స్ డైరక్ట్ చేస్తున్నారు. ఇక కాజల్ ప్రస్తుతం మహేష్ తో చేయనున్న ది బిజెనెస్ మ్యాన్ చిత్రానికి డేట్స్ ఇచ్చి ఉంది.రాజమౌళి చిత్రం నవంబర్ లో ప్రారంభం కానుంది.

English summary
Kajal agarwal, who is busy with bunch of offers after her Dada’s failure is yet signed another movie with prabhas. This movie is being directed by Rajamouli and K.Raghavendra rao will produce this movie. Regular shooting of this movie will start in November.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu