సూర్యతో రొమాన్స్ చేయనున్న క్రేజీ హీరోయిన్ కాజల్...!
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తూ, బిజీగా వున్న కాజల్ అగర్వాల్ అటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తూ అక్కడ కూడా పాగా వేయడానికి సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ముద్దుగుమ్మ తమిళ స్టార్ సూర్యాతో కూడా ఓ సినిమా అంగీకరించింది. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సూర్యా హీరోగా రూపొందే 'మాత్రాన్' సినిమాలో కథానాయికగా ఎంపికైంది. కాజల్ ఇంతకుముందే తమిళంలో భారతీ రాజా డైరెక్షన్ లో నటించిన విషయం తెలిసిందే
దర్శకుడు ఆనంద్ పలువురు బాలీవుడ్ కథానాయికల్ని ఈ పాత్ర కోసం పరిశీలించిన మీదట చివరికి కాజల్ ను ఎంపిక చేసుకున్నాడు. పారితోషికం కూడా భారీగా అంటే 1.25 ఇస్తున్నట్టు కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ను పాకిస్తాన్ బోర్డర్ ఏరియాలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సూర్య ఐదు గెటప్స్ లో కనిపిస్తాడట..!
kajal surya kv anand mr perfect brindavanam darling కాజల్ సూర్య కెవి ఆనంద్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ బృందావనం డార్లింగ్


Click it and Unblock the Notifications