కాజల్-వినయ్ ల ‘బినామి వేల కోట్లు'..!?

By Sindhu

వినయ్, కాజల్ జంటగా తమిళంలో రూపొందిన చిత్రం 'మోది వెలియాడు". చేరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో 'బినామి వేలకోట్లు" పేరుతో అనువదిస్తున్నారు నిర్మాత సిహెచ్‌ వీయస్ బాబ్జీ. శ్రీ చక్ర మూవీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా అనువాద కార్యక్షికమాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత బాబ్జీ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ' మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో తమిళంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా వున్నాయి. కాజల్ ఈ చిత్రంలో ఓ సంపన్నురాలైన యువతిగా కనిపిస్తారు. కథ విషయానికొస్తే 'వేలాది కోట్ల రూపాయలకు అధిపతి అయిన ఓ డాన్ తన కుమారుడ్ని కాపాడుకునేందుకుగాను చేసిన ప్రయత్నాల్లో ఊహించని రీతిలో ఓ సంఘటన జరుగుతుంది? ఆ తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పులేమిటి? అనేది చిత్ర కథాంశం.

ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. దర్శకుడు చేరన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుందనే నమ్మకం వుంది" అన్నారు. సంతానం, కళాభవన్ మణి, కొచ్చిన హనీషా, రవివూపకాష్, మైలుస్వామి, అమిత్ ధావన్, యువ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన: సూరి, సంగీతం: హరిహరన్, ఛాయాక్షిగహణం: ఎ.డి.కరుణ్, ఎడిటింగ్: వి.టి.విజయన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X