క్రేజీ కాజల్ నే కావాలంటోన్న సూపర్ స్టార్...!
తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా వరుస విజయాలతో వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్ కి తమిళంలోనూ డిమాండ్ పెరుగుతోంది. కెవి ఆనంద్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సూర్య నటించనున్న ఓ చిత్రానికి కాజల్ సైన్ చేసింది. వాస్తవానికి తమిళ్ లో కూడా తనకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, గతేడాది అక్కడ తను ఒకే ఒక్క సినిమా చేసింది. సూర్యా తమ్ముడు కార్తీ హీరోగా నటించిన 'నాన్ మహాన్ అల్లా' లో తను నటించింది. అది మంచి హిట్ కూడా అయింది. తర్వాత తమిళంలో మరో చెప్పుకోతగ్గ చిత్రం చేయకపోయినా కానీ తెలుగునాట సాధిస్తున్న విజయాలు కాజల్ ని తమిళ హీరోల దృష్టికి తీసుకెళుతున్నాయి.
తమిళ సూపర్ స్టార్ సూర్య తన తదుపరి చిత్రం 'మాత్రన్" లో కాజల్ ని కథానాయికగా తీసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే తెలుగు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండడం, బాలీవుడ్ లోనూ అవకాశం రావడంతో కాజల్ డైరీ నిండిపోయింది. అయినా కానీ ఆమె డేట్స్ దొరికేవరకు వేచి చూడాలని సూర్య అనుకుంటున్నాడట.
తన సోదరుడు కార్తీతో కాజల్ నటించిన 'నాన్ మహాన్ అల్లా" సినిమా చూసిన తర్వాత సూర్య కూడా ఆమెతో నటించాలని డిసైడయ్యాడట. తన 'సింగం" హిందీ రీమేక్ కి అజయ్ దేవ్ గణ్ ఏరికోరి కాజల్ ని ఎంచుకోవడంతో సూర్య మరింత ఇంప్రెస్ అయ్యాడట. ఇప్పుడే కాజల్ డిమాండ్ ఇలా ఉంటే ఇక తమిళ మగధీర హిట్టయితే కాజల్ కి మరింతమంది తమిళ స్టార్లనుంచి ఆఫర్స్ వస్తాయేమో...


Click it and Unblock the Notifications











