అందంతో అక్కడా దున్నేస్తానంటున్న కాజల్
ఇప్పుడు తెలుగు హీరో, హీరోయిన్స్ దృష్టి అంతా తమిళ ఫీల్డ్ మీద ఉంది. అక్కడా ఇక్కడా దున్నేయాలని అంతా ద్వి భాషా చిత్రాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమన్నా తమిళంలో హిట్టవటం చాలా మందిని ఆ దిసగా ప్రేరేపించింది. ఇలియానా ఇప్పటికే వేడి చిత్రంతో విక్రమ్ తో జతకడితే...హన్సిక ఆల్రెడీ ధనుతో ఓ సినిమా పూర్తి చేసేసింది. మరో ప్రక్క మగధీర ప్రక్కన చేసిన కాజల్ నేనేం తక్కువ అన్నట్లు తానూ 'నాన్ మహాన్ అల్ల' చిత్రంలో అడుగెట్టింది. తెలుగులో ఆవారా, యుగానికొక్కడు చిత్రాలతో పరిచయమైన కార్తీ ప్రక్కన ఈ చిత్రంలో కాజల్ చేస్తోంది. అలాగే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారని సమాచారం. ఇది క్లిక్ అయితే తమిళంలో సెటిల్ అయిపోయినట్లే అంటోంది. ఇంతకుముందు కూడా కాజల్..తమిళంలో భారతీరాజా చిత్రం 'బొమ్మలాట్టం' లో చేసింది కానీ వర్కవుట్ కాలేదు.
కాజల్ ఇలియానా విక్రమ్ హన్సిక మగధీర ఆవారా యుగానికొక్కడు నాన్ మహాన్ అల్ల kajal ileana vikram hansika magadheera awara yuganiki okkadu


Click it and Unblock the Notifications