‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
తమిళ నాట సంక్రాంతి బరిలోకి మాస్టర్ సినిమాతో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా విడుదలయ్యాయి. శింబు హీరోగా వచ్చిన ఈశ్వరన్, జయం రవి భూమి సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగాయి. అయితే ఇందులో మాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈశ్వరన్ పర్వాలేదనిపించింది. ఇక జయం రవి భూమి సినిమా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సామాజిక సందేశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది.
మామూలుగా ఏ హీరో అయినా కూడా తమ కెరిర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రాలను స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటారు. 25, 50, 75వ చిత్రాలను స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడుతుంటారు. కానీ జయం రవి మాత్రం ప్రయోగాలను ఎంచుకున్నాడు. భూమి వంటి సామాజిక చిత్రాన్ని ఎంచుకున్నాడు. అయితే జయం రవికి మాత్రం మంచి పేరు వచ్చింది.

'భూమి' కోసం కోలీవుడ్ సెలెబ్రిటీలందరూ కలిసి వస్తున్నారు. చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా కాజల్ తన హీరో జయం రవి కోసం ఓ వీడియోను షేర్ చేసింది. కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా మంచి కమర్షియల్ సినిమాను చేసే అవకాశం ఉన్నా కూడా భూమి వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని చేశాడంటూ కాజల్ చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరూ కలిసి చేసిన కోమలి చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











