twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పాత్రలో నటిస్తున్నా.. అందుకే ధైర్యం చేసి ఒప్పుకున్నా.. స్టార్ హీరోయిన్ క్లారిటీ

    |

    ఇండియన్ డైరెక్టర్ శంకర్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో అప్పట్లో వచ్చిన ఇండియన (భారతీయుడు) చిత్రం ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరు భారతీయుడు సీక్వెల్‌పై దృష్టి పెట్టారు. అయితే ఏ ముహుర్తాన ఈ చిత్రాన్ని ఓకే చేశారో గానీ అన్నీ ఆటంకాలే ఏర్పడ్డాయి. ఒకానొక దశలో అసలీ ప్రాజెక్ట్ ఉంటుందా? అనే అనుమానాలు కూడా రేకెత్తాయి.

    ఎన్నో అవాంతరాలు..

    ఎన్నో అవాంతరాలు..

    ఇండియన్ 2 చిత్రం అనుకున్నప్పటి నుంచీ ఎన్నో అవాంతరాలు వచ్చాయి. లొకేషన్స్, సెట్స్ నచ్చలేదని శంకర్ అలిగాడని వార్తలు వచ్చాయి, బడ్జెట్ మించిపోతోందని నిర్మాతలు వెనకడుగు వేశారని, కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ వాయిదా పడిందని ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    ఘనంగా ప్రారంభం..

    ఘనంగా ప్రారంభం..

    అయితే ఈ మూవీ షూటింగ్, పూజా కార్యక్రమాలు మాత్రం ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్‌లో కమల్ హాసన్ గెటప్ కూడా అదిరిపోయింది. ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు కాజల్ అగర్వాల్ సైతం ఎంతో ఆనందపడింది. అయితే మధ్యలో ఈ చిత్రం ఆలస్యం కావడం, కాజల్‌ను తప్పించారనే వార్తలు కూడ వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లుగానే మిగిలిపోయాయి.

    మొదట బయపడ్డాను..

    మొదట బయపడ్డాను..

    అయితే ఇండియన్ 2 లో కాజల్ పాత్ర గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు లెక్కలు వేసుకుంటున్నారు. అలాంటి వాటన్నంటికి పుల్ స్టాప్ పెడుతూ.. క్లారిటీ ఇచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. ఇండియన్ 2 చిత్రం కోసం దర్శకుడు శంకర్ తనను సంప్రదించిన సమయంలో ఎలాంటి పాత్ర ఇస్తారో అని భయపడ్డానని చెప్పుకొచ్చింది. కానీ షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆ భయం అంతా పోయిందని తెలిపింది.

    వయసు మళ్లిన పాత్ర..

    వయసు మళ్లిన పాత్ర..

    అందరూ అనుకున్నట్టుగానే.. తాను 85 ఏళ్ల ముసలమ్మ పాత్రల్లో కనిపించబోతున్నానని చెప్పేసింది. కథలో చాలా కీలకమైన పాత్ర తనదని.. కమల్ హాసన్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది. అందుకే ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపింది.

    English summary
    Kajal Aggarwal Gives Clarity On Her Character In Indian 2 Movie. She Opened uP about Her 85 Years Old Character InIndian 2. Because it Is An Important Role After Kamal Hassan Character.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X