అతనంటే నాకు ప్రేమ, ఇష్టం... అందుకే మూడుసార్లు.. పెదవి విప్పిన కాజల్ అగర్వాల్

దక్షిణాదిలో అగ్రతారల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ చిత్రాలతో జోరు కొనసాగిస్తున్నది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తమిళ సూపర్‌స్టార్లు విజయ్, అజిత్ కుమార్ గురించి తన మనసులోని మాటను వెల్లడించారు. విజయ్‌తో కలిసి తుపాకి, జిల్లా, మెర్సల్, అజిత్‌తో వివేకం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె వారి గురించి ఏమన్నారంటే..

హీరో, థలా విజయ్ గురించి

హీరో, థలా విజయ్ గురించి

విజయ్, అజిత్‌తో నటించే ముందు నేను ఎలాంటి భయానికి గురికాలేదు. విజయ్‌తో మూడు సినిమాలు చేశాను. ఆయన ఇండస్ట్రీలో అత్యంత టాలెంట్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. ఆయనలోని సహజత్వం అంటే ఇష్టం. సెట్స్‌లోకి వస్తే ప్రపంచాన్ని మరిచిపోతాడు. అందుకే అతనంటే ఒకరకమైన ప్రేమ అని కాజోల్ వెల్లడించింది.

అజిత్ సార్ ఎలాంటి వారంటే

అజిత్ సార్ ఎలాంటి వారంటే

వివేకంలో నటించడానికి ముందు అజిత్ సార్ గురించి చాలా తెలుసుకొన్నాను. అప్పుడే ఎలాగైన ఆయనతో నటించాలనే కోరిక మనసులో ఉండేది. అతను అద్భుతమైన వ్యక్తి. గొప్ప మానవత్వం ఉన్న మనిషి. అందుకే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా అణుకువగా ఉండే స్వభావం నాకు నచ్చుతుంది అని కాజల్ తెలిపింది.

ఇద్దరికి ఏ మాత్రం గర్వం ఉండదు

ఇద్దరికి ఏ మాత్రం గర్వం ఉండదు

తమిళ ఇండస్ట్రీని శాసించే టాప్ హీరోలైన విజయ్, అజిత్‌లో ఏ మాత్రం గర్వం కనిపించదు. ఎదుటి వ్యక్తికి మంచి గౌరవం ఇచ్చి కంఫర్ట్‌గా ఉంచుతారు. వారిద్దరితో కలిసి నటించిన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేను. మళ్లీ అవకాశం వస్తే వారిపక్కన నటించడానికి నేను సిద్ధం అని కాజల్ పేర్కొన్నారు.

 కమల్‌తో ఇండియన్ 2లో

కమల్‌తో ఇండియన్ 2లో

శంకర్ తెరకెక్కించే ఇండియన్ 2 చిత్రంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ సరసన నటించే అవకాశాన్ని ప్రస్తుతం కాజల్ అగర్వాల్ దక్కించుకొన్నది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్నది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

క్వీన్ రీమేక్‌లో కాజల్ అగర్వాల్

క్వీన్ రీమేక్‌లో కాజల్ అగర్వాల్

అంతేకాకుండా కాజల్ అగర్వాల్ హిందీ చిత్రం క్వీన్ రీమేక్‌లో నటిస్తున్నది. తమిళంలో ఈ చిత్రాన్ని పారిస్ పారిస్ అనే పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జయం రవి నటించే కొమ్మలి చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ రూపొందిస్తున్నది. ప్రదీప్ రంగనాథన్ అనే నూతన దర్శకుడు సినిమాను రూపొందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X