తని ఒరువన్ 2లో కాజల్ అగర్వాల్.. విలన్‌గా అరవింద స్వామికి ధీటైన నటుడు!
2016 విడుదలైన తని ఒరువన్ చిత్రం తమిళంలో అఖండ విజయం సాధించింది. ఈ పవర్ ఫుల్ పోలీస్ డ్రామాలో హీరోగా జయం రవి నటించాడు. జయం రవి సోదరుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. తని ఒరువన్ చిత్రంలో అన్ని పాత్రలు బావుంటాయి. కానీ విలన్ పాత్ర మాత్రం సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో అరవింద స్వామి విలన్ గా నటించాడు.
ఇటీవల ఈ చిత్రానికి సీక్వల్ చేయబోతున్నాం అంటూ మోహన్ రాజా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు సన్నాహకాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తని ఒరువన్ 2 లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో నయనతార నటించింది. సీక్వెల్ లో మాత్రం కాజల్ అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక విలన్ విషయంలో సంచలన రూమర్ ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే విడుదలకు ముందే సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోతాయి. సీక్వెల్ లో కూడా విలన్ పాత్రని మోహన్ రాజా పవర్ ఫుల్ గా డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మోహన్ రాజా మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టిని కలసి కథ వివరించాడట. మోహన్ రాజా మమ్ముట్టిని కలిసింది విలన్ పాత్ర కోసమే అని తమిళ సినీవర్గాల్లో చర్చ మొదలైంది.


Click it and Unblock the Notifications











