రష్యా మోజులో పడిన అందాల హీరోయిన్
ఫొటోలు తీయడమంటే హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు మహా సరదా. షూటింగుల్లో ఆమె ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వెళ్లింది. షూటింగులతో సరిపుచ్చకుండా ఆయా ప్రాంతాల్లోని ముఖ్యమైన వాటిని తన కెమెరాలో బంధించడం కూడా ఆమెకు అలవాటు. అయితే, ఆమె ఇటీవల రష్యాకు కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న మాత్రాన్ షూటింగ్ నిమిత్తం వెళ్లింది. అప్పటి నుంచి ఆ భామామణి నోటి వెంట రష్యా మాట తప్ప మరోటి వినిపించలేదట. రష్యా అందాల గురించి, చారిత్రక ఘట్టాల గురించి ఆమె చాన్స్ వస్తే చాలు తెగ చెప్పేస్తోందని అంటున్నారు.
రష్యాకు ఇదే తన మొదటి ట్రిప్పు అని, సిట్జర్లాండ్, న్యూజిలాండ్ మాదిరిగా కాకుండా రష్యా అసాధారణమైన ప్రదేశమని, తాను ఏ ప్రాంతానికి వెళ్లిన అక్కడి చారిత్రక విశేషాలు తెలుసుకుంటానని ఆమె చెబుతోందని అంటున్నారు. రష్యాలోని కొన్ని చారిత్రక ప్రదేశాలు తనను ఇట్లే పట్టేశాయని, ఎప్పటి మాదిరిగానే దర్శకుడు చాలా సాహసోపేతమైన లోకేషన్స్‌లో షూటింగ్ చేశాడని ఆమె చెబుతోంది. రష్యాకు మళ్లీ వెళ్లాలని ఉందని ఆమె చెప్పేస్తోంది.


Click it and Unblock the Notifications











