స్టార్ కమెడియన్‌కు జోడిగా కాజల్ అగర్వాల్.. ఆ విషయంపై దృష్టిపెట్టిన బ్యూటీ!
తెలుగు, తమిళం, బాలీవుడ్ అనే తేడా లేకుండా అగ్రహీరోల సరసన రాణిస్తున్న కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం తీసుకొన్నది. తమిళంలో స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకొన్న యోగిబాబుతో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. జాక్‌పాట్, గులేబకావళి లాంటి చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన కల్యాణ్ రూపొందిస్తున్న ఘోస్ట్‌లీ అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఘోస్ట్‌లీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పలు యాక్షన్ సీన్లలో కనిపిస్తారని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా కోసం కాజల్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.

సీడ్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘోస్ట్‌లీ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. జాకోబ్ రతినారాజ్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రంలో ఊర్వశి, మొట్టై రాజేంద్రన్, సత్యన్, మనోబాలా, మాయిల్ సామీ, శ్రీమన్, సంతాన భారతీ, ఆడుకాలమ్ నరేన్, కేఎస్ రవికుమార్ నటించనున్నారు.
హారర్ చిత్రంగా రూపొందే ఘోస్ట్‌లీ చిత్రం పూర్తిగా హాస్య ప్రధానంగా సాగుతుంది. ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకలు ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











