twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోకి నా కళ్ళంటే చాలా ఇష్టం...కాజల్

    By Srikanya
    |

    మగధీర చిత్రంలో తెలుగులో స్టార్ హీరోయిన్ స్ధాయికి ఎదిగిన కాజల్ తాజాగా తమిళ చిత్రం 'నాన్‌ మహాన్‌ అల్ల' (నేను మహాత్ముడ్ని కాదు) చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఆవారా ఫేమ్ కార్తీ హీరోగా చేసిన ఆ చిత్రం తమిళంలో మంచి బిజెనెస్సే చేసి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆమెను కలిసిన మీడియాతో కాజల్..తన హీరో కార్తీ గురించి ఇలా చెప్పుకొచ్చింది. సూర్య తమ్ముడైన కార్తీ ఇంతకు ముందు తమన్నా తో ప్రేమ వ్యవహారాలు నడిపాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాజల్ తో కలిసి తిరుగుతున్నాడంటూ వినపడుతున్నాయి.

    ఇక కాజల్ కార్తీ గురించి చెబుతూ..కార్తీది ఫ్రెండ్లీ నేచర్‌. సినిమా కుటుంబం నుంచి వ్యక్తి కాబట్టి నటన అతని రక్తంలోనే ఉందనుకుంటా. ఎలాంటి సన్నివేశాన్నైనా ఇట్టే ఆకళింపు చేసుకోగలడు. నాన్‌ మహాన్‌ అల్ల షూటింగ్‌ సమయంలో అతని దగ్గరినుంచి చాలా నేర్చుకున్నా. మీకో విషయం తె లుసా? కార్తీకి నా కళ్లంటే చాలా ఇష్టం అంది. ఇక తనకూ కార్తీకీ మధ్య కథ నడిచిందంటూ వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ..నేను రూమర్స్ కు మద్యస్తంగా ఉంటాను. ఎందుకంటే సినీ పరిశ్రమలో రూమర్స్ రావడం సహజమే. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మన హద్దులో మనముంటే రూమర్స్ కు అవకాశం ఉండదని నా నమ్మకం. అందుకే నా హద్దుల్లో నేనుంటాను అంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X