పుట్టిన రోజునే పాపం కాజల్....

తెలుగులో రామ్ చరణ్ తేజ సరసన నటిస్తున్న కాజల్ మరోవైపు తమిళంలో 'మోది విలయాదు' సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో 'వాన' ఫేమ్ వినయ్ హీరో. చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో నిన్న (బుధవారం) ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆమె పుట్టినరోజు కావడంతో యూనిట్ సభ్యుల మధ్య ఉదయమే కేక్ కోసి సంబరం చేసుకుంది. ఆ తర్వాత దర్శకుడు శరణ్ హీరో హీరోయిన్‌ల మీద ఒక కత్తి ఫైటింగ్ సన్నివేశాన్ని ప్లాన్ చేశాడు. వినయ్, కాజల్ చెరో కత్తి పట్టుకుని ఫైటింగ్ చేస్తున్నారు.
అనుకోకుండా వినయ్ చేతిలోని కత్తి కాజల్ తలకు తగిలింది. వెంటనే రక్తం కారడం మొదలైంది. ఆ వెంటనే ఆమెను యూనిట్ సభ్యులు దగ్గర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు చికిత్స జరిపి నాలుగు కుట్లు వేశారు. రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. జన్మదినం రోజే కాజల్ ఇలా గాయపడటంతో 'మోది విలయాదు' యూనిట్ సభ్యులంతా విచారం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











