రామ్ చరణ్ పుణ్యమా అని కాజల్ కెరీర్ కూడా
త్వరలో తమిళంలో 'మగధీర" డబ్బింగ్ వెర్షన్ విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో రామ్ చరణ్ కి ఎంతలా ఉపయోగపడిందో అంతకుమించి కాజల్ కి వర్కవుట్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె బిజీ స్టార్ అయిపోయింది. దాంతో తమిళంలో ఆ చిత్రం డబ్ చేసి వదలుతున్నారంటే ఆమెకు యమా హ్యాపీగా ఉంది. ఆ సినిమాను రామ్ చరణ్ కి తమిళంలో మార్కెట్ రావటం కోసమని, రెండు తమిళ మార్కెట్ లోనూ హిట్ కొట్టి డబ్బు చేసుకుందామని అల్లు అరవింద్ ప్లాన్ చేసి స్ట్రైయిట్ సినిమాలా ఆడియో పంక్షన్ ఘనంగా చేసి విడుదల చేస్తున్నారు. అయితే విడుదల అయ్యాక ఈ చిత్రంతో హీరోయిన్ గా చేసిన కాజల్ కి కూడా పేరు వస్తుందంటున్నారు. అందులోనూ కాజల్ ఆల్రెడీ తమిళ పరిశ్రమలో పోటీలో నిలబడి ఉంది. తమిళంలో ఇంతకుముందు 'నాన్ మహాన్ అల్లా" చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న ఈమె త్వరలో విడుదల కానున్న 'మగధీర" తమిళ డబ్బింగ్‌తో సెటిల్ అవుతానని ఆశ పడుతోంది. అదీ రామ్ చరణ్ పుణ్యాన కాజల్ కూడా వర్కవుట్ అవటం అంటే. కాజల్ ప్రస్తుతం నాగచైతన్య సరసన ఓ చిత్రంతో పాటు రవితేజ సరసన 'వీర" చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించిన కాజల్ అక్కడ అజయ్ దేవగన్‌తో సింగం రీమేక్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











