ఇక్కడ కాంపిటీషన్ పెరుగుతోందని అక్కడ ఎర వేస్తున్న స్టార్ హీరోయిన్...
ప్రస్తుతం తెలుగులో టాప్ పొజిషన్ లో వుండి, పెద్ద హీరోలతో ఐదారు సినిమాలు చేస్తున్న కాజల్ ఇప్పుడు కోలీవుడ్ మీద కూడా కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కేవలం తెలుగు చిత్రాలకే పరిమితమైన ఈ సుందరాంగి, ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అవుతోంది అనిపించగానే అటు వైపు ఓ లుక్కేస్తోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా తను యాక్సప్ట్ చేసిన ఓ తమిళ చిత్రాన్నే చెప్పుకోవచ్చు.
కెవి ఆనంద్ దర్శకత్వంలో సూపర్ స్టార్ సూర్య నటించనున్న ఓ చిత్రానికి కాజల్ సైన్ చేసింది. వాస్తవానికి తమిళ్ లో కూడా తనకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, గతేడాది అక్కడ తను ఒకే ఒక్క సినిమా చేసింది. సూర్యా తమ్ముడు కార్తీ హీరోగా నటించిన 'నాన్ మహాన్ అల్లా' లో తను నటించింది. అది మంచి హిట్ కూడా అయింది. అయితే, ఆ తర్వాత మళ్లీ అక్కడ చేయలేదు. ఇప్పుడు మళ్లీ అతని సోదరుడి చిత్రంతోనే కోలీవుడ్ లో ఎంటర్ అవుతోంది. ముందు జాగ్రత్తగా కోలీవుడ్ లో కూడా తన స్థానాన్ని పదిలపరచుకోవడానికే కాజల్ తమిళ్ చిత్రాలు కూడా యాక్సప్ట్ చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











