రష్యా భాష నేర్చుకుంటున్న ముద్దుగుమ్మ
తమిళంలో పెద్ద హిట్స్ చూడని ముద్గుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇప్పుడు రష్యా భాష నేర్చుకుంటోందట. మాత్రాన్ తమిళ సినిమాలో సహజంగా కనిపించడానికి ఆమె రష్యా భాషపై పట్టు సాధించాలని పట్టుబడుతోందని అంటున్నారు. ఈ సినిమా రెండు భాషల్లో నిర్మితమవుతోంది. ఈ సినిమాలో కాజల్ పోషిస్తున్న పాత్ర రష్యన్ భాషను గలగలా మాట్లాడేస్తోందట. పర్ఫెక్ట్ డిక్షన్ కోసం ఆమె రష్యా భాషలో ప్రావీణ్యం సంపాదించాలని అనుకుంటోందని చెబుతున్నారు.
రష్యా భాషను నేర్పడానికి రష్యా నుంచి ఓ శిక్షుకుడిని పిలిపించుకున్నట్లు సమాచారం. ఆమె చాలా తొందరగా పరాయి భాషపై పట్టు సాధిస్తోందని చెబుతున్నారు. చిత్రం చాలా భాగం షూటింగ్ రష్యాలో జరిగింది. ఈ సినిమాకు కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య లీడ్ రోల్ పోషిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











