బిజినెస్ మ్యాన్ హీరోయిన్ కాజల్ ‘తుపాకి’ గురి ఎవరిపై...!?
తెలుగులో కాస్త జోరు తగ్గించిన కాజల్ అగర్వాల్ తమిళంలో వరుసగా రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ జోరు పెంచేసింది. ప్రస్తుతం తెలుగులో మహేష్ తో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బిజినెస్ మ్యాన్" చిత్రంలోనూ అలాగే ఈ నెల 9న ప్రారంభమైన రామ్ చరణ్ చిత్రంలోనూ నటిస్తున్న కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
తన పంథాకు భిన్నంగా మురుగదాస్ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తమిళంలో ' మాళై నీరతు మళియతుల్లి" అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్ కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నారట.
తెలుగులో ఈ చిత్రాన్ని 'తుపాకి" అనే పేరుతో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ ని ఇటీవలే మురుగదాస్ ఖరారు చేశాడు. ఈ నెల 23న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లాంఛనంగా ముంబైలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. హేరీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2012లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











