అగ్ర నటుడితో కుష్బూ సహజీవనం, పెళ్లి.. మొదటి భార్యతో విభేదాలు.. చివరికీ!
ముస్లిం కుటుంబంలో జన్మించిన కుష్బూ బాల నటిగా సినిమాల్లో కెరీర్ ప్రారంభించారు. ఫ్యామీలీ హీరో, విక్టరీ వెంకటేష్‌తో సరసన నటించిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేశారు. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన కుష్బూ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వంటి తదితర స్టార్ హీరోలతో జత కట్టి ఆడిపాడారు. తెలుగులోను ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని సత్తా చాటారు. అయితే తాజాగా ఆమెకు గతంలో స్టార్ తమిళ నటుడితో ఉన్న రిలేషన్ పై తెలుగు నటి కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సపోర్టింగ్ పాత్రలు:తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది సీనియర్ నటి కుష్బూ. ఆమెకు అక్కడ ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కుష్బూకు ఏకంగా గుడి కట్టి మరి అభిమానాన్ని చాటుకునే ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో కూడా ఆమె మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్, బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.

షాకింగ్ విషయాలు:జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవి చేపట్టిన కుష్బూ ఆమె తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఇటీవల అనారోగ్యం పాలైనట్లు, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. అయితే గతంలో సినిమాల్లో నటిస్తున్న క్రమంలో అప్పట్లో అగ్ర నటుడిగా పేరు సంపాదించుకున్న ప్రభుతో కుష్బూ సహజీవనం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలుగు నటి కాకినాడ శ్యామల షాకింగ్ విషయాలను తాజాగా బయటపెట్టారు.
నాలుగు నెలలకే:1991లో తమిళ నటుడు ప్రభుతో కలిసి చిన్న తంబి అనే సినిమాలో నటించింది కుష్బూ. ఈ సినిమా తర్వాతే వీరి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్నాళ్లు సహజీవనం చేశారట. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారని, కానీ పెళ్లయిన నాలుగు నెలలకే తమ బంధానికి స్వస్థి పలికారని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు. అందుకు గల కారణాలు శ్యామల వెల్లడించగా ఈ స్టోరీ ప్రస్తుతం వైరల్ గా మారింది.

హాయిగా ఉంది:"కుష్బూ చాలా మంచి అమ్మాయి. ప్రభు, ఆమె ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ప్రభుకు అప్పటికే పెళ్లయింది. ప్రభు మొదటి భార్య వీళ్ల రిలేషన్ ను ఒప్పుకోలేదు. మొత్తానికి వీరి వివాహం ప్రభు కుటుంబంలో వివాదాలకు దారి తీసింది. అందుకే చివరికీ విడిపోవాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు ఆమె హాయిగా ఉంది. మంచి దర్శకుడిని పెళ్లి చేసుకుంది. చక్కటి పిల్లలు ఉన్నారు అని కాకినాడ" శ్యామల తెలిపారు.
శివాజీ గణేశన్ వ్యతిరేకత:అయితే గతంలో కూడా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు ప్రభుతో తనకు ఉన్న రిలేషన్ గురించి కుష్బూ ఓపెన్ గా చెప్పింది. ప్రభుతో నాలుగేళ్లు రిలేషన్ లో ఉన్నానని, చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని ఆయన నివాసంలో 1993లో ఇద్దరికీ పెళ్లి కూడా జరిగినట్లు తెలిపారు. అయితే ప్రభుకు అప్పటికే పెళ్లి అయినందున ఆయన తండ్రి శివాజీ గణేశన్ తమ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని కుష్బూ పేర్కొన్నారు.

కుంగిపోయిన కుష్బూ:అంతేకాకుండా ప్రభు మొదటి భార్యతో విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన నాలుగేళ్లకే విడిపోవాల్సి వచ్చిందని కుష్బూ గతంలో వెల్లడించారు. ప్రభుతో విడిపోయిన తర్వాత కుష్బూ మానసికంగా కుంగిపోయిందని టాక్. కానీ క్రమంగా ఆ సమస్య నుంచి బయటపడి కోలీవుడ్ డైరెక్టర్ సి. సుందర్ ను 2000 సంవత్సరంలో కుష్బూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.


Click it and Unblock the Notifications











