కళాభవన్ మణికి కీ రోల్ ఇచ్చారు

By Srikanya

చెన్నై : దృశ్యం చిత్రంలో కరప్టెడ్ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కీలకమైంది. ఆ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్రను ఇప్పుడు తమిళంలో కళాభవన్ మణి పోషించనున్నారు. కమల్ హాసన్ హీరోగా చేస్తున్న దృశ్యం రీమేక్ లో ఈ పాత్రకు గానూ మణిని అడిగినట్లు ఆయన సంతోషంగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. కళాభవన్ మణి లాంగ్ గ్యాప్ తర్వాత తమిళంలో చేస్తూండటంతో తనకు ఇది రీఎంట్రీ చిత్రంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లో దృశ్యం టైటిల్ తో తెరకెక్కి విజయవంతమైన చిత్రం ఇప్పుడు తమిళంలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి అక్కడ 'దృశ్యం'టైటిల్ తో కాకుండా 'పాపనాశం' అనే టైటిల్ ఖరారు చేశారని కోలీవుడ్ టాక్. అయితే ఇప్పటివరకూ అంతటా ఇదే టైటిల్ తో వస్తున్న ఈ లక్కి టైటిల్ ని మార్చటంతో తమిళ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

Kalabhavan Mani in Kamal's Papanasanam

తమిళంలో ఈ చిత్రం కమల్‌హాసన్ హీరోగా పునర్నిర్మితం కానుంది. మరో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మలయాళ, తెలుగు భాషల్లో మీనా చేసిన పాత్రను నటి, కమల్‌హాసన్ ఆప్తమిత్రురాలు గౌతమి చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తారు.

ముచ్చటగా ఉండే ఇద్దరు కూతుళ్లు, మనసెరిగి నడుచుకునే భార్యతో అతగాడి జీవితం సాఫీగా సాగుతుంటుంది. కానీ, పెద్ద కూతురి జీవితంలో రేగిన కలకలంతో ఆ కుటుంబం ఎలా తల్లడిల్లిందనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం 'దృశ్యం'. ఏ భాషకైనా నప్పే కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా పునర్నిర్మితమై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మరో ప్రక్క ఇప్పటికే 'దృశ్యం' నిర్మాతలకు బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన పుస్తకంలోని విషయాలను కాపీ కొట్టి 'దృశ్యం' చిత్రాన్ని తెరకెక్కించారని ఏక్తా కపూర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. జపనీస్ రచయిత రాసిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏక్తా కపూర్ ఆ పుస్తకం రైట్స్ కొనుగోలు చేసారు. అయితే 'దృశ్యం' చిత్రం చూసిన ఏక్తా కపూర్ అండ్ టీం తాము రైట్స్ దక్కించుకున్న పుస్తకంలోని విషయాలతో 'దృశ్యం' సినిమా ఉండటంతో షాక్‌కు గురైందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X