సెక్స్ వర్కర్ పాత్ర కోసం నమితకు కరుణానిధి రికమండేషన్
ఇలైగ్నాన్ సినిమాలో సెక్స్ వర్కర్ పాత్ర కోసం తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నమితను రికమండ్ చేశారు. ఈ సినిమాకు కరుణానిధి కథను సమకూర్చారు. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ మార్టిన్ నిర్మాత. హీరో, దర్శకుడు ఇద్దరు కూడా ఫిమేల్ రోల్ కోసం అన్వేషిస్తుండగా కరుణానిధి నమిత పేరు చెప్పారు. ఆఫర్ వచ్చిందే తడవుగా నమిత ఎగిరి గంతేసింది. ఈ చిత్ర నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. నమిత త్వరలో యూనిట్ లో చేరనుంది. ఈ సినిమాలో నమిత సెక్స్ వర్కర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











